Bigg Boss 9 | బిగ్ బాస్ సీజన్ 9లో రెండో వారం నామినేషన్ ప్రక్రియలో భాగంగా బిగ్ బాస్ హౌజ్ హీటెక్కింది. నామినేషన్స్ కొన్ని సందర్భాల్లో ఫన్నీగా, మరికొన్ని సందర్భాల్లో ఆవేశంగా సాగింది. అయితే కంటెస్టెంట్లు ఎక్కువమంది నామినేషన్ కారణాలు రెడ్ ఫ్లవర్ ,ఎగ్ గొడవ గురించే చెప్పడం విశేషం. హరీష్‌ని రెడ్ ఫ్లవర్ విషయంలో, భరణిని ఎగ్ గొడవ కారణంగా పలువురు నామినేట్ చేశారు.మంగళవారం ఎపిసోడ్ (9వ రోజు)లో రాము రాథోడ్.. కళ్యాణ్ యాటిట్యూడ్ నచ్చలేదని నామినేట్ చేశాడు. దీనిపై కళ్యాణ్ ట్రోల్ అవుతావంటూ కౌంటర్ ఇవ్వడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. రెండో నామినేషన్‌గా హరీష్‌ని ఎంచుకున్నాడు.
ప్రియా మాత్రం ఫ్లోరాని షాంపూ ఇష్యూ పై, భరణిని మళ్లీ ఎగ్ గొడవ కారణంగా నామినేట్ చేసింది. ఇక రీతూ చౌదరీ తన మొదటి నామినేషన్‌గా హరీష్‌ని ఎంచుకుంది. మిస్టేక్స్ ఒప్పుకొని గివప్ ఇస్తున్నావు, అలాంటి వ్యక్తి హౌస్‌లో ఉండాల్సిన అవసరం లేదు అని చెప్పింది. దీనిపై హరీష్ కౌంటర్ ఇస్తూ, నువ్వే ఏడుస్తూ సింపతీ గేమ్ ఆడుతున్నావు అంటూ ఘాటుగా సమాధానం ఇచ్చాడు. వీరి మధ్య ఘర్షణ తారా స్థాయికి చేరింది. రెండో నామినేషన్‌గా రీతూ ఫ్లోరాని బట్టలు ముట్టుకోవడం, ఫ్రీ బర్డ్ యాటిట్యూడ్ కారణంగా నామినేట్ చేసింది.
సుమన్ శెట్టి తన నామినేషన్స్‌లో ప్రియాని దొంగతనం అంశం పై, మనీష్‌ని హౌస్‌లోకి అనుమతించలేదనే కారణంతో ఎంచుకున్నాడు. పవన్ కళ్యాణ్ ఫ్లోరాని థంమ్స్ అప్ ఇష్యూ పై, భరణిని ఎగ్ గొడవ పై నామినేట్ చేశాడు. ఇమ్మాన్యుయెల్ మనీష్నికెప్టెన్సీ టాస్క్‌లో తన ఓటమికి కారణమయ్యావు అని, హరీష్ ని బాడీ షేమింగ్, రెడ్ ఫ్లవర్ ఇష్యూ కారణంగా నామినేట్ చేశాడు. ఇక్కడ కూడా ఘర్షణలు చోటు చేసుకున్నాయి. భరణి ప్రియా, పవన్‌లను నామినేట్ చేస్తూ, ఫుడ్, కుక్కింగ్ విషయంలో ఇబ్బందులు కలిగించారు అన్నాడు. కళ్యాణ్ తన నామినేషన్స్‌గా భరణి, హరీష్‌లను ఎంచుకున్నాడు. ఫ్లోరా. తనూజ, పవన్‌లను సింపుల్ కారణాలతో నామినేట్ చేసింది.
హరీష్ మాత్రం భరణి, ఇమ్మాన్యుయెల్‌లను నామినేట్ చేస్తూ,..గుడ్డు విషయంలో నాటకం ఆడావు అని ఆరోపించాడు. దీంతో భరణి ఫైర్ అయ్యాడు. శ్రీజ మాత్రం హరీష్, భరణిలను నామినేట్ చేస్తూ, నీకు హౌస్‌లో ఉండాల్సిన అవసరం లేదు, వెళ్లిపో అంటూ వార్నింగ్ ఇచ్చింది. దీనిపై హరీష్ కూడా డోర్ ఓపెన్ చేస్తాను, దమ్ముంటే బయటికి పంపించండి అంటూ రచ్చ చేశాడు.
నామినేషన్స్ ముగిసే సరికి భరణి, హరీష్, పవన్ కళ్యాణ్, ప్రియా, ఫ్లోరా సైనీ, మనీష్లతోపాటు సుమన్ శెట్టి కూడా నామినేట్ అయ్యాడు. అయితే కెప్టెన్ సంజనాకు ప్రత్యేక అధికారం ఇచ్చిన బిగ్ బాస్, ఒకరిని నేరుగా నామినేట్ చేసే అవకాశం కల్పించగా ఆమె సుమన్ శెట్టినే నామినేట్ చేసింది. దీంతో సుమన్ శెట్టి ఫన్నీగా రచ్చ చేసి ఎపిసోడ్‌ను హైలైట్ చేశాడు. మొత్తంగా రెండో వారం నామినేట్ అయినవారు భరణి, హరీష్, పవన్ కళ్యాణ్, ప్రియా, ఫ్లోరా సైనీ, మనీష్, సుమన్ శెట్టి