Bigg Boss 9 | స్టార్ మా ప్రసారం చేస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 మూడో వారం రసవత్తరంగా సాగుతుంది. హౌజ్‌లో టెన్షన్, భావోద్వేగాలు, ఎంటర్టైన్మెంట్ మిశ్రమంగా కనిపిస్తున్నాయి.ఇక ఈ వారం నామినేషన్లలో శ్రీజ, కళ్యాణ్, రీతూ చౌదరీ, ఫ్లోరా, రాము రాథోడ్, హరీష్ ఉన్నారు. తాజా ఎపిసోడ్లో నామినేషన్లపై చర్చ ఎక్కువగా జరిగింది. భరణి కామెంట్స్‌పై శ్రీజ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసి కన్నీళ్లు పెట్టుకుంది. తాను అందరికీ నెగటివ్‌గా కనిపిస్తున్నాననే వ్యాఖ్య తనను బాగా కలచేసిందని తెలిపింది. ఇక రీతూ చౌదరీ తనను నామినేట్ చేసిన పవన్ దగ్గర హార్ట్ బ్రేక్ అయ్యిందని చెబుతూ ఎమోషనల్ అయ్యింది. పవన్ ఓదార్చినా, రీతూ కన్నీళ్లను ఆపలేకపోయింది.
కుకింగ్ విషయంలో సంజనా, హరీష్‌ల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. సంజనా కుక్ చేస్తున్నప్పుడు హరీష్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఆమెను “డ్రామా క్వీన్” అని కామెంట్ చేశాడు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. నామినేషన్లలో ఉన్న రీతూ చౌదరీని బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్‌కి పిలిచి, చికెన్ పీస్‌లు చూపించారు. దాంతో తల్లి గుర్తొచ్చి రీతూ కన్నీళ్లు పెట్టుకుంది. చికెన్ దక్కాలంటే రహస్యాలు చెప్పాలనే షరతు పెట్టడంతో, రీతూ తనూజకి కళ్యాణ్‌పై క్రష్ ఉందని, పవన్ గతంలో ప్రేమలో విఫలమయ్యాడని తెలిపింది. ఇక సంజనా గల్రానీ తన కాలేజ్ లవ్ స్టోరీని షేర్ చేస్తూ, ఒక అబ్బాయి తనను పెళ్లి చేసుకోవడానికి నా రూపాన్ని చెడగొట్టాలని ప్రయత్నించాడని, చివరికి అతను యాక్సిడెంట్లో మరణించాడని చెప్పి షాక్ ఇచ్చింది.
తరువాత బిగ్ బాస్ హౌజ్ కంట్రోల్ తనదేనని ప్రకటించి, ఆపిల్స్ అందజేశారు. కుటుంబ సందేశాలను పొందడానికి కండీషన్స్ పెట్టారు. ఈ క్రమంలో ఇమ్మాన్యుయెల్ తన అమ్మ సందేశాన్ని మిగిలిన వారి కోసం త్యాగం చేయడం హౌజ్‌మేట్స్‌ని కదిలించింది. ఎపిసోడ్ చివర్లో తనూజ, సుమన్ శెట్టి జంటగా చేసిన కామెడీ స్కిట్ హౌజ్ వాతావరణాన్ని కూల్ చేసింది. ఇమ్మాన్యుయెల్ కూడా తోడవడంతో నవ్వులు పూశాయి.మొత్తానికి తాజా ఎపిసోడ్ ప్రేక్షకులకి కూడా మంచి ఫన్ అందించింది.