Bigg Boss 9 | బిగ్ బాస్ తెలుగు 9లో మంగళవారం ఎపిసోడ్ నామినేషన్ డ్రామాతో నిండిపోయింది. ఈ వారం హౌజ్‌లో ఘర్షణలు, ఎమోషన్లు, ఫైర్ బరస్ట్‌లతో హౌజ్‌లో వాతావరణం వేడెక్కింది. కళ్యాణ్ తనూజని కాకుండా సంజనాని నామినేట్ చేయడంతో ఇమ్మాన్యుయెల్ ఫైర్ అయ్యాడు. “నువ్వు ఇలా ఎలా చేశావ్?” అంటూ ఘాటు ప్రశ్నలు విసిరాడు. ఇది తనూజ వరకు చేరింది. “ఎందుకు నన్నే టార్గెట్ చేస్తున్నావ్?” అంటూ తనూజ కూడా ఆవేదన వ్యక్తం చేసింది. ఈ వాదన తారాస్థాయికి చేరి, “నువ్వు స్వీట్ పాయిజన్” అని అనుకునేంత వరకూ వెళ్లింది
ఇక సంజనా మాట్లాడుతూ కళ్యాణ్‌కు నోరు జారింది. “తనూజ నిఖిల్‌కి క్లోజ్ అవుతోంది, నువ్వు ఒంటరైపోతావ్” అని చెప్పడం కళ్యాణ్, తనూజలను ఆగ్రహానికి గురి చేసింది. “ఇలాంటి కామెంట్లు ఎందుకు చేస్తున్నావ్?” అంటూ ఇద్దరూ సంజనాపై విరుచుకుపడ్డారు. తనూజ కూడా “కంటెంట్ కోసం ఇలా చేస్తావ్” అంటూ సంజనాని తప్పుబట్టింది. తర్వాత సంజనా ఇమ్మాన్యుయెల్ గురించి మాట్లాడుతుండగా భావోద్వేగానికి లోనయ్యింది. “అతను నాకు కొడుకులాంటివాడు. నా కొడుకుని వదిలేసి ఇక్కడికి వచ్చా, కానీ ఇమ్మాన్యుయెల్‌ని చూసి నా బాబుని గుర్తు చేసుకుంటా అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఈ సన్నివేశం హౌజ్‌లోని అందరినీ కదిలించింది.
బిగ్ బాస్ తాజా ఎపిసోడ్లో కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ ఇచ్చాడు. హౌజ్‌ని రెండు గ్యాంగ్స్‌గా విభజించారు. ఒక టీమ్‌కి సంజనా సైరెన్, మరో టీమ్‌కి మాస్ మాధురి లీడర్లుగా నియమితులయ్యారు. ఎవరి టీమ్‌లో ఎక్కువ మంది ఉంటారో వారు కెప్టెన్సీకి అర్హులు అవుతారు. దొంగల థీమ్‌లో జరిగిన ఈ టాస్క్ ఫన్నీగా సాగింది. ఈ టాస్క్‌లో ఇమ్మాన్యుయెల్ చేసిన కామెంట్ హాట్ టాపిక్‌గా మారింది. మాధురిని పొగుడుతూ “మాధురీ అమరహే” అంటూ నినదించడం అందరినీ షాక్‌కి గురి చేసింది. వెంటనే తన మాటలను సరి చేసుకున్నప్పటికీ ఆ మాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అలాగే “మా అక్కతో పెట్టుకుంటే ఎలిమినేషన్ ఖాయం” అంటూ చేసిన కామెంట్ కూడా హౌజ్‌లో చర్చకు దారితీసింది. మొత్తానికి, ఈ ఎపిసోడ్లో నామినేషన్లు, ఎమోషన్లు, కామెంట్లు అన్నీ కలిపి బిగ్ బాస్ హౌజ్‌ను రచ్చ రచ్చగా మార్చేశాయి. ఇక ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది చూడాలి!