Bigg Boss 9 | మరి కొద్ది రోజులలో తెలుగులో బిగ్ బాస్ సీజన్ 9 ప్రారంభం కానుంది. ఎప్పుడా ఎన్నడా అంటూ ఎదురు చూస్తున్న అభిమానులకి షోపై మరింత ఆసక్తి కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. మళ్లీ కింగ్ నాగార్జున హోస్ట్‌గా బాధ్యతలు చేపట్టనున్న ఈ షోకు సంబంధించిన ప్రోమో ఇప్పటికే ఒకటి విడుదల కాగా, తాజాగా నాగ్ మరో భారీ అప్డేట్తో అందరిని ఆశ్చర్యపరిచారు. ఇప్పటివరకూ సెలబ్రిటీలు, టీవీ ఆర్టిస్టులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకే ఈ హౌస్‌లోకి ఎంట్రీ లభించేది. కానీ ఈ సారి మాత్రం బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు. సాధారణ ప్రజలకు కూడా అవకాశం ఇవ్వబోతున్నట్టు షో నిర్వాహకులు అధికారికంగా ప్రకటించారు.
ఈ అవకాశాన్ని అందుకోవాలంటే bb9.jiostar.com వెబ్సైట్లో రిజిస్టర్ కావాలి. పేరుతో పాటు మొబైల్ నంబర్ వేరిఫై చేసిన తర్వాత, “మీరు బిగ్ బాస్ హౌస్‌లోకి ఎందుకు రావాలనుకుంటున్నారు?” అనే విషయాన్ని వీడియో రూపంలో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. షార్ట్‌లిస్ట్ అయిన వారికి సెలెక్షన్ ఛాన్స్ ఉంది. ఈ విషయంపై నాగార్జున మాట్లాడుతూ, “ఇప్పటివరకు మీరు బిగ్ బాస్‌ను ఎంతగా ప్రేమించారు! ఆ ప్రేమకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలనిపించింది. ఈసారి సెలబ్రిటీలు మాత్రమే కాదు… మీరు కూడా బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టే ఛాన్స్ ఉంది. తలుపులు తెరచి మీ కోసం ఎదురు చూస్తున్నాయి… రండి!” అంటూ వెల్లడించారు. ఆయన చెప్పిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇటీవల విడుదలైన ప్రోమోలో నాగార్జున మాట్లాడుతూ, “ఆటలో అలసిపోయినవారికి గెలుపు సాధ్యం కాదు. ఇది చదరంగం కాదు… రణరంగం!” అంటూ బిగ్ బాస్ 9పై ఆసక్తి పెంచారు. గతంలో బాలకృష్ణ లేదంటే విజయ్ దేవరకొండ హోస్ట్ చేస్తారనే వార్తలు వచ్చినా, చివరికి నాగార్జునే మళ్లీ ఈ సీజన్‌ని హోస్ట్ చేయబోతున్నారు. ఈ సీజన్ కోసం ఇప్పటికే పలువురు టీవీ యాక్టర్లు, సినిమా స్టార్స్, పాపులర్ సోషల్ మీడియా ఫిగర్స్‌కు అవకాశం దక్కినట్టు తెలుస్తుంది. ఒప్పందాలు ఖరారైన తర్వాత అధికారిక లిస్టు రాబోతోందని తెలుస్తోంది. ఇప్పుడు సామాన్యులకు కూడా చోటు లభించబోతుండటంతో ఈ సీజన్ మరింత ఇంట్రెస్టింగ్గా సాగే సూచనలు కనిపిస్తున్నాయి.