Bigg Boss 9 | బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో తొలివారం ఎంతో ఆసక్తికరంగా సాగినప్పటికీ, సెప్టెంబర్ 13వ తేదీ శనివారం ఎపిసోడ్ మాత్రం హోస్ట్ అక్కినేని నాగార్జున తీరుతో మరో లెవెల్‌కి ఎక్కిపోయింది. హౌస్‌లో మొదటి వారంలో నెలకొన్న వివాదాలు, తప్పుడు మాటలు, బాధ కలిగించే కామెంట్స్‌కు చెక్ పెడుతూ, ప్రతి ఒక్కరికి తమ బాక్స్‌లు బద్దలయ్యేలా క్లాస్ పీకారు నాగార్జున.ఈ క్రమంలో షోను పూర్తిగా సీరియస్ మోడ్‌లోకి మార్చేశారు. అయితే హౌస్‌లో హరీష్ చేసిన కొన్ని వ్యాఖ్యలు.. ముఖ్యంగా “గుండు అంకుల్”, “రెడ్ ఫ్లవర్”, మరియు “ఆడంగి” వంటి పదాలు తీవ్ర విమర్శలకు గురయ్యాయి. ఇవి బాడీ షేమింగ్ , జెండర్ డిస్రిస్పెక్ట్గా పరిగణించబడటంతో నాగార్జున వాటిపై బాగా ఫైర్ అయ్యారు.
“నువ్వు ‘గుండు అంకుల్’ అని హర్ట్ అయ్యావ్ కదా? అలాగే ‘రెడ్ ఫ్లవర్’ అనే పదం కూడా ఎదుటివారిని హర్ట్ చేయకూడదా? నువ్వు ఎలా ఫీల్ అయ్యావో.. అదే ఫీల్ అవుతారు వాళ్లు కూడా అంటూ హరీష్‌కి క్లాస్ పీకాడు నాగ్. అలానే హరీష్ చేసిన “ఆడాళ్లతోనే మాట్లాడతా”, “ఆడంగి” వంటి వ్యాఖ్యలపై కూడా వీడియో ప్రూఫ్‌తో కలిపి హౌస్‌లోని కంటెస్టెంట్స్‌కి, ఆడియన్స్‌కి చూపించిన నాగ్, హరీష్ బాక్స్ బద్దలు కొట్టారు. ఫ్లోరా-రాము మధ్య జరిగిన సంభాషణలో సంజనా జోక్యం చేసుకుని “ఫ్లోరా ఫ్రీ బర్డ్” అంటూ వ్యాఖ్య చేయడంతో మొదలైన కాంట్రవర్సీ కూడా నాగార్జున ముందుకొచ్చింది. ఫ్లోరా అభ్యంతరం వ్యక్తం చేయడంతో, హౌస్‌లోని సభ్యుల మద్దతుతో సంజనను తప్పుపట్టిన నాగార్జున… ఆమె బాక్స్ కూడా బద్దలు కొట్టారు. గుండు అంకుల్ అనే పదాన్ని సరదాగా అన్నా, హరీష్ సీరియస్ తీసుకోవడంతో మొదలైన వివాదంలో నాగార్జున ఇమ్మాన్యుయేల్‌ని మోటివేట్ చేస్తూ, “నవ్వించాలన్న ఉద్దేశం బాగానే ఉంది, కానీ హద్దుల్లో ఉండాలి” అంటూ చురకలు అంటించారు.
తనూజ గ్రూప్‌గా వ్యవహరించిన శ్రీజ, ప్రియ, రీతూ లకి కూడా నాగార్జున క్లాస్ పీకారు. “ఓనర్స్ అన్నాక షాడిజం చూపించాలా?” అంటూ ప్రశ్నలు వేస్తూ.. వాళ్ల బాక్స్‌లు కూడా బద్దలు కొట్టారు. ఇన్నన్ని ఆరోపణల మధ్య కూడా హరీష్ సారీ చెప్పడంలో వెనకడుగు వేయడంతో, నాగార్జున ఫైనల్‌గా “మీరు చెప్పుకునే హరిత హరీష్‌కి, మీరు ప్రవర్తించే హరీష్‌కి తేడా ఉంది” అంటూ క్లాస్ ఇచ్చారు. “ఇక్కడ మీ పేరుకే కాదు, మీ బిహేవియర్కే విలువ ఉంటుంది” అంటూ ఆయన స్పష్టం చేశారు. ఇక సంజనా హౌస్‌లో తనపై అసంబద్ధ ఆరోపణలు వస్తున్నాయని భావించి డిఫెన్సివ్ మోడ్‌లోకి వెళ్లింది. ఫ్లోరా కమిట్మెంట్ మీద స్పష్టత కోరుతూ మేచ్యూర్గా స్పందించింది. ఇమ్మానుయేల్ ఎమోషనల్ అయినా, ఆడియన్స్ మద్దతు పొందాడు. హరీష్ చివరి వరకు తనదే కరెక్ట్ అన్నట్టు వాదించి అది జస్టిఫై చేయడంలో విఫలం అయ్యాడు.