Bigg Boss 9 | బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో ఈ వారం టాస్క్‌ల సమరం రసవత్తరంగా సాగుతోంది. ప్రతీ వారం ఏదో ఒక రచ్చతో హౌస్ కుదిపేసే బిగ్ బాస్ ఈసారి “బీబీ రాజ్యం” అనే కాన్సెప్ట్‌తో హౌస్ మూడ్ మార్చేశాడు. ఈ టాస్క్‌లో ఇమ్మాన్యుయేల్ కెప్టెన్‌గా ఉండగా, రాజ్యానికి పవన్ కళ్యాణ్ రాజు, దివ్య, రీతూ మహారాణులు అయ్యారు. తనూజ, నిఖిల్, డీమాన్, సంజన కమాండర్లుగా ఎంపికవ్వగా, మిగతా సభ్యులు ప్రజలుగా ఉండేలా గేమ్ డిజైన్ చేశారు. టాస్క్‌లకు విరామం ఇచ్చిన సమయంలో బిగ్ బాస్ రాజు, రాణీలకు ప్రజల సేవలు పొందే అవకాశం ఇచ్చాడు. ఈ అవకాశాన్ని దివ్య పూర్తిగా ఉపయోగించుకుంది. ఆమె ప్రజలతో విభిన్న సేవలు చేయించుకుంటూ హౌస్‌లో సరదా వాతావరణం సృష్టించింది.
ఈ క్రమంలో భరణీతో హెడ్ మసాజ్ చేయించుకోవడం హౌస్‌లో హైలైట్‌గా మారింది. భరణీ తొలుత సిగ్గుపడ్డా, దివ్య వదల్లేదు. మసాజ్ చేయమంటే “గోకుతావేంటి?” అంటూ దివ్య ఇచ్చిన స్వీట్ వార్నింగ్ హౌస్‌లో నవ్వులు పూయించింది.తదుపరి టాస్క్‌లో రీతూ సంచాలకురాలిగా ఉండగా, సంజనా మరియు రీతూ మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. తీవ్ర వాగ్వాదం తర్వాత సంజనా ఆ టాస్క్‌లో ఓడిపోయింది. తన స్థానం కాపాడుకోవడానికి బిగ్ బాస్ సంజనకు “బిల్డ్ ఇట్ టు విన్ ఇట్” టాస్క్ ఇచ్చాడు. సంజనా పోటీదారుగా సుమన్ శెట్టిని ఎంచుకుంది. ఇద్దరూ బాక్సులతో టవర్ నిర్మించే ఈ టాస్క్‌లో సుమన్ అద్భుతంగా ప్రదర్శించినా, పవన్ కళ్యాణ్ చివరికి సంజనను విన్నర్‌గా ప్రకటించాడు. అయితే ఈ నిర్ణయం హౌస్‌లో వివాదానికి దారి తీసింది.
టవర్ ఫర్ఫెక్ట్గా ఉందా లేదా అనే అంశంపై హౌస్మెట్స్ చర్చించుకున్నారు. తనూజ “ముందే చెప్పలేదు” అంటూ వాదించగా, పవన్ కళ్యాణ్ గట్టిగా స్పందించాడు. “నీకు సగం సగం అర్థమైతే సగం సగం చెప్పకు!” అంటూ తనూజపై ఫైర్ అయ్యాడు. ఇద్దరి మధ్య ఘర్షణ పెరగడంతో హౌస్‌లో టెన్షన్ వాతావరణం నెలకొంది. అన్ని వాదనల తర్వాత కూడా పవన్ కళ్యాణ్ తన నిర్ణయాన్ని మార్చలేదు. సంజననే విన్నర్‌గా ప్రకటించాడు. దీంతో సంజన తన కమాండర్ స్థానం నిలబెట్టుకుంది. అయితే ఈ పరిణామాలపై హౌస్‌లో మిశ్రమ స్పందనలు వినిపిస్తున్నాయి.బిగ్ బాస్ హౌస్‌లో జరుగుతున్న ఈ పరిణామాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.