Bigg Boss 9 | బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లోకి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి షో మరింత ఆసక్తికరంగా మారింది. 38వ రోజు ఎపిసోడ్ మొదటి నుంచే డ్రామా పీక్కు చేరింది. ప్రస్తుతం హౌస్‌లో దివ్య రేషన్ మేనేజర్‌గా వ్యవహరిస్తుండగా, ఫుడ్ విషయంలో ఆమెకి మాధురికి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. తనకు చెప్పకుండా ఫుడ్ తీసుకున్నందుకు దివ్య, మాధురిని ప్రశ్నించగా, మాధురి కోపంతో “అందరికీ ఫుడ్ అవసరం.. నేను కూడా అమ్మనే” అంటూ సమాధానం ఇచ్చింది. దీనిపై దివ్య “ఇక్కడ అమ్మ అనేది ఎందుకు వచ్చింది? రేషన్ మేనేజర్‌కి చెప్పాలి కదా!” అంటూ కౌంటర్ ఇచ్చింది. దీంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది.
బిగ్ బాస్ ఇచ్చిన స్పెషల్ ఆఫర్లో భాగంగా రమ్య, సుమన్ శెట్టికి ఫుడ్ రిక్వెస్ట్ చేసే ఛాన్స్ దక్కింది. ఆ అవకాశం దొరకగానే రమ్య మోక్ష తనకు ఇష్టమైన వంటకాల జాబితా చెబుతూ బిగ్ బాస్‌ను షాక్ కి గురి చేసింది . ఎగ్ పెసరట్టు, ఎగ్ బిర్యానీ, చికెన్ జాయింట్స్, కాఫీ, ఐస్ క్రీమ్, పిజ్జా, నెయ్యి, పచ్చి మామిడి కాయలు ఇలా లిస్ట్ చాలా పొడవుగానే ఉంది. దీంతో నెటిజెన్స్ “రమ్య కోరికలు తీర్చాలంటే బిగ్ బాస్ ఆస్తులు అమ్ముకోవాల్సిందే అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. ఇక గార్డెన్ ఏరియాలో పవన్, అయేషా జీనత్ మధ్య సరదా రొమాన్స్ హౌస్‌లో హైలైట్‌గా మారింది. పవన్, అయేషాను పైకెత్తుకుని డ్యాన్స్ చేయగా, ఇమ్మాన్యుయేల్ “కొత్త వాళ్లు రాగానే రీతూని వదిలేశాడు!” అంటూ సెటైర్లు వేశాడు. ఈ మాటలతో హౌస్ అంతా నవ్వుల్లో మునిగిపోయింది.
కానీ రీతూ మాత్రం ఈ రొమాన్స్‌ను అంత ఈజీగా తీసుకోలేదు. ఆమె నిజంగానే అలిగి, పవన్‌కి దూరమైంది. తర్వాత పవన్ ఆమెను బుజ్జగించేందుకు ప్రయత్నించాడు. రోజు చివర్లో కిచెన్‌లో రీతూ-అయేషా మధ్య పాత్రల విషయం పెద్ద గొడవకు దారితీసింది. రాత్రి క్లీన్ చేయాల్సిన పాత్రలు అలాగే ఉండిపోవడంతో, అయేషా రీతూకి ఎదురు తిరిగింది. ఇద్దరూ పెద్దగా అరుస్తూ, హౌస్ వాతావరణాన్ని హీటెక్కించారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో షోలో కొత్త ఉత్సాహం వచ్చినా, గొడవలు కూడా అంతే స్థాయిలో పెరిగిపోయాయి. దివ్య, మాధురి గొడవలు, పవన్-రీతూ-అయేషా ట్రైయాంగిల్ లవ్‌స్టోరీస్ హౌస్‌లో కొత్త టెన్షన్‌ని తెచ్చాయి. రాబోయే ఎపిసోడ్లలో ఇంకా ఎలాంటి ట్విస్టులు రానున్నాయో చూడాలి మరి!