Bigg Boss 9 | బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో 45వ రోజు పూర్తిగా ఎంటర్టైన్మెంట్తో నిండిపోయింది. ఈ ఎపిసోడ్లో హౌస్ మేట్స్ బ్లూ టీం, రెడ్ టీంగా విడిపోయి సరదాగా గేమ్‌లు ఆడారు. రెడ్ టీంకి లీడర్‌గా మాధురి, బ్లూ టీంకి లీడర్‌గా సంజన వ్యవహరించారు. రోజు ఆరంభంలోనే రెడ్ టీం సభ్యుల మధ్య తీవ్ర వాదన నెలకొంది. రీతూ చౌదరి “టీంలో ఎవరు డబ్బు సంపాదించినా అందరికీ పంచాలి” అని చెప్పగా, తనూజ మాత్రం “ఇది నా స్ట్రాటజీ, ఎందుకు పంచాలి?” అని కౌంటర్ ఇచ్చింది. దీనిపై రీతూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ, “ఇలా అయితే టీం అవసరం ఏమిటి? ఎవరికి వారు గేమ్ ఆడుకోండి!” అంటూ గట్టిగా మాట్లాడింది. ఇద్దరూ ఒకరిపై ఒకరు అరుస్తూ హౌస్‌లో ఉద్రిక్తత సృష్టించారు.
తర్వాత బిగ్ బాస్ రెండు టీమ్స్‌కి సరదా టాస్క్ ఇచ్చారు. మాధురి టీం కాఫీ షాప్ నడపగా, సంజన టీం పానీ పూరీ షాప్ నిర్వహించింది. ఈ సమయంలో ఇమ్మాన్యుయేల్ “సంజనని చీట్ చేస్తాను” అని చెప్పి వెళ్లాడు. కానీ పానీ పూరీ తింటూ బ్లూ టీంలో చేరిపోయాడు. మాధురి ఈ విషయం సంజనకు చెప్పేసింది. ఇమ్మాన్యుయేల్ చీటింగ్‌పై సంజన ఫన్నీగా రియాక్ట్ అయింది. “సిగ్గులేని జీవితం, అమ్మా అమ్మా!” అంటూ మోసం చేసావు కదా అంటూ చమత్కారంగా ఫైర్ అయింది. ఈ సీన్ చూసి హౌస్ మేట్స్ అందరూ తెగ నవ్వేసారు.
తదుపరి టాస్క్‌లో బిగ్ బాస్ సభ్యులను “కాలు పైకి లేపి చెప్పు బోర్డుపై అతికించాలి” అనే సవాల్లో పాల్గొనమన్నారు. ఐదు రౌండ్లలో ఏ టీం ఎక్కువ ఎత్తులో చెప్పు అతికిస్తే, వారు విజేతలుగా నిలుస్తారు. ఈ గేమ్‌లో రెడ్ టీం సభ్యురాలు రీతూ చౌదరి 6 ఫీట్ ఎత్తులో చెప్పు అతికించి విజేతగా నిలిచింది.రెడ్ టీం విజయం సాధించడంతో, బిగ్ బాస్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఓడిన బ్లూ టీం సభ్యులు మాధురిని ఎత్తుకుని హౌస్‌లో ఊరేగించారు. ఈ సీన్ హౌస్‌లో అందరినీ నవ్వుల్లో ముంచేసింది. మొత్తంగా 45వ రోజు బిగ్ బాస్ హౌస్‌లో హాస్యం, హీట్, హంగామా అన్నీ కలగలిసి ప్రేక్షకులకు పక్కా ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది అని చెప్పాలి.