 
                                                            Bigg Boss 9 | కింగ్ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 రోజు రోజుకూ ఆసక్తికర మలుపులు తిరుగుతోంది. ఈ సీజన్లో ఎలిమినేట్ అయిన భరణి, శ్రీజలు మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత హౌస్‌లో డ్రామా, ఎమోషన్, ఎంటర్టైన్మెంట్ అన్నీ మరింత పెరిగాయి. తాజా ఎపిసోడ్ (54వ రోజు) పూర్తిగా మాధురి, తనూజల చుట్టూ తిరిగింది. ఇద్దరి మధ్య ఏర్పడిన అపార్థాలు, కోపాలు హౌస్ వాతావరణాన్ని ఉద్రిక్తంగా మార్చేశాయి. తనూజతో తలెత్తిన విభేదాల కారణంగా మాధురి ఆహారం తినడం మానేసింది. దీనిపై భరణి భావోద్వేగంగా స్పందిస్తూ .. “అందరూ తింటూ ఆమె మాత్రం తినకుంటే నాకు బాధగా ఉంది, దయచేసి ఆమెని తినమని చెప్పండి” అని అన్నాడు. ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఇదిలా ఉండగా, బిగ్ బాస్ భరణి–శ్రీజలకు ప్రత్యేక టాస్క్ ఇచ్చాడు. భరణి ట్రీట్మెంట్ తీసుకుంటున్నందున, అతని స్థానంలో దివ్య పాల్గొంది. బాక్స్‌లను ఐరన్ రూఫ్‌లపై బ్యాలెన్స్ చేయాల్సిన ఈ టాస్క్‌లో దివ్య అద్భుతంగా ఆడి భరణి టీమ్‌కి విజయం సాధించి పెట్టింది. ఇక తనూజ, మాధురి మధ్య అసలు గొడవ ఫుడ్ విషయంలోనే వచ్చింది. “నాకు తిండి తక్కువ అవుతోంది, చపాతీ ఎక్కువ పెట్టుకున్నావు” అంటూ తనూజ చేసిన వ్యాఖ్యలపై మాధురి మనస్తాపం చెందింది. “నేను ఫుడ్ కోసం చస్తున్నాను అని మా వాళ్లకు తెలిస్తే బాధపడతారు” అని కన్నీళ్లతో సమాధానం చెప్పింది. ఆ తర్వాత ఇమ్మాన్యుయేల్, సంజన కలిసి మాధురిని బుజ్జగించి తినమని ఒప్పించే ప్రయత్నం చేశారు. అయినా కూడా మాధురి తినడానికి నిరాకరించింది.
తరువాతి సీన్లో మాధురి, తనూజలు కలిసిపోయి జాలీగా మాట్లాడుతూ హౌస్ వాతావరణాన్ని మళ్లీ లైట్‌గా మార్చేశారు. ఇది చూసి ఇమ్మాన్యుయేల్ సరదాగా ..“ఇద్దరూ గొడవలు పడతారు, వెంటనే కలిసిపోతారు.. మధ్యలో మేమంతా బకరా అవుతాం” అంటూ సెటైర్లు వేశాడు. ఇక టాస్క్ సమయంలో శ్రీజ, పవన్‌ల మధ్య ఘర్షణ తలెత్తింది. “పవన్ గేమ్‌లో మమ్మల్ని పట్టించుకోలేదు” అని శ్రీజ ఆవేశంగా మాట్లాడగా, పవన్ “నేను కళ్యాణ్‌కి హెల్ప్ చేయడానికి వెళ్లాను కదా” అంటూ సమాధానం ఇచ్చాడు. చివరికి పవన్ కాస్త వ్యంగ్యంగా “హ్యాపీ న్యూ ఇయర్” అన్న మాట శ్రీజను మరింత కోపం తెచ్చిపెట్టింది. “తొక్క తోటకూర నా దగ్గర మాట్లాడకు” అంటూ ఆమె ఘాటుగా వార్నింగ్ ఇచ్చింది. మొత్తంగా, బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో రీ-ఎంట్రీలతో హౌస్ డైనమిక్స్ పూర్తిగా మారిపోయాయి. భరణి, శ్రీజ తిరిగి రావడంతో హౌస్ మళ్లీ హీటెక్కుతుంది. తదుపరి ఎపిసోడ్లో ఈ ఘర్షణలు ఎలాంటి మలుపు తిరుగుతాయో చూడాలి!
 
                            