Bigg Boss 9 | బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో శనివారం ఎపిసోడ్ చాలా హాట్ హాట్‌గా సాగింది. ఈ వారం హౌస్‌లో చోటుచేసుకున్న వివాదాలన్నింటి పైన నాగార్జున రివ్యూ చేశారు. ఎవరు ఎక్కడ తప్పు చేశారో క్లియర్‌గా చెప్పి వారికి తనదైన స్టైల్లో క్లాస్ పీకారు. ముఖ్యంగా రీతూ–మాధురి, సంజన–దివ్య, తనూజ–రాము మధ్య జరిగిన గొడవలపై నాగ్ విపులంగా చర్చించారు. మాధురి టీంలో ఉండి కూడా రీతూ పవన్‌కు డబ్బు ఇవ్వాలని అనుకోవడం తప్పు అని నాగార్జున తేల్చేశారు. అదే స్టాండ్ ఉంటే ముందే మాధురికి చెప్పాల్సింది అని చెప్పారు. అలాగే రీతూ మాట జారడమే ఈ గొడవకు కారణమని, కానీ మాధురి కూడా “నేలకేసి కొడతా” వంటి మాటలు వాడటం తప్పే అని హెచ్చరించారు.
మాధురి వాదనలు కొనసాగించగా, నాగార్జున “మీరు తోపు అయితే బయట చూసుకోండి.. బిగ్ బాస్ హౌస్‌లో కాదు” అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. రాము దగ్గర కూర్చుంటే అసహ్యంగా ప్రవర్తించిన తనూజను నాగ్ తీవ్రంగా మందలించారు. “అలా అసహ్యించుకోవడం సరైంది కాదు, ఎవరైనా డిస్ట్రబ్ చేస్తే సాఫ్ట్‌గా చెప్పొచ్చు” అని సూచించారు. దివ్యని “రోడ్ రోలర్” అంటూ బాడీ షేమింగ్ చేసిన సంజనకు నాగార్జున వీడియోలు చూపించి మరీ క్లాస్ పీకారు. వెంటనే దివ్యకు సారీ చెప్పమని నాగార్జున ఆదేశించారు. సంజన క్షమాపణ చెప్పినా దివ్య “ఇది ఆమె అలవాటు.. మళ్లీ చేస్తుంది” అంటూ సారీని అంగీకరించలేదు.
హౌస్‌మేట్స్‌లో ఉన్న కంటెస్టెంట్స్ లోపాలకి సంబంధించి వారి మెడలో బోర్డులు వేశారు. అందులో మాధురికి ‘ఇగోయిస్టిక్’ వంటి ట్యాగ్స్ ఎక్కువగా రావడంతో ఆమెకు శిక్ష విధించారు. ఇక ఈ వారం నామినేషన్స్‌లో కళ్యాణ్, రీతూ, దివ్య, సాయి, తనూజ, రమ్య, రాము, సంజన ఉన్నారు. నాగార్జున బెలూన్ గేమ్ ఆడించి ఎవరు సేఫ్ అనేది ప్రకటించారు. కళ్యాణ్‌కి బెలూన్ నుంచి గ్రీన్ కలర్ రావడంతో అతను సేఫ్ అయ్యాడు. ఇక మిగిలిన వారిలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది సండే ఎపిసోడ్లో తేలనుంది. మొత్తం మీద ఈ వారం నాగార్జున రివ్యూ ఎపిసోడ్ బిగ్ బాస్ అభిమానులను ఫుల్ ఎంటర్టైన్ చేసింది. హౌస్‌లోని కంటెస్టెంట్స్‌కి ఇది పెద్ద లెసన్‌గా మారింది