Bigg Boss 9 | బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఆదివారం ఎపిసోడ్ ఆసక్తికరంగాను, ఎమోషనల్–ఎంటర్టైన్మెంట్ మేళవింపుగా సాగింది. హోస్ట్ కింగ్ నాగార్జున వేదిక మీదకు అక్కినేని నాగ చైతన్యను తీసుకురావడంతో ఎపిసోడ్ మరింత అట్రాక్షన్‌గా మారింది. హౌస్‌మేట్స్‌తో సరదా గేమ్స్, ఫన్నీ మాటలు, చివరిగా ఎలిమినేషన్… మొత్తం ఎపిసోడ్ అభిమానులను ఆకట్టుకుంది. అయితే స్టేజ్‌పైకి నాగ చైతన్యకి నాగార్జున ప్రేమగా స్వాగతం పలికారు. ఇద్దరూ కలిసి ‘శివ’ రీ-రిలీజ్ గురించి మాట్లాడుకున్నారు. అనంతరం చైతూ తన రేసింగ్ టీం Hyderabad Blackbirds గురించి వివరించారు. దీనిపై నాగార్జున “నాకు చెప్పకుండానే ఓనర్ అయిపోయావా?” అని సరదాగా సెటైర్ వేయగా, చైతూ కూడా నవ్వుతూ స్పందించాడు.
ఇక నాగార్జున హౌస్‌మేట్స్‌తో యానిమల్ పేర్స్ గేమ్ ఆడించారు. అందరూ సరదాగా ఆడుతూ ఫుల్ ఎంజాయ్ చేశారు. చైతూ హౌస్‌మేట్స్‌తో ఇంటరాక్షన్ కూడా ఆసక్తికరంగా సాగింది. ఈ ఎపిసోడ్లో ఎక్కువ దృష్టి ఆకర్షించింది రీతూ చౌదరి ప్రవర్తన. చైతూని చూసిన వెంటనే పొగడ్తల మోత మోగించింది. చైతూ కాళ్లు శిల్పం లా ఉంటాయి, ఆయన అభిమానిని… ఆయనని చూసి ఫిదా అయిపోతాను అని ఫ్లర్టింగ్ చేస్తూ అందరినీ నవ్వుల్లో ముంచెత్తింది. అయితే దానికి నాగార్జున స్పందిస్తూ “ఆ శిల్పాన్ని చెక్కింది నేనే” అంటూ ఫన్నీ కామెంట్ చేశారు. అంతే కాకుండా నాగార్జున రీతూకి “ఇప్పుడు బయటికి వచ్చేస్తే చైతూతో బైక్ రైడ్‌కు పంపిస్తా” అని ఆఫర్ ఇచ్చాడు.దానికి రీతూ “నేను రెడీ!” అని అనడంతో హౌజ్ మొత్తం నవ్వుల్లో మునిగిపోయింది.
అయితే చైతూ.. టైటిల్ గెలిచాక కూడా రైడ్‌కు రావొచ్చు.. బిగ్ బాస్ ఎందుకు వదులుకుంటావు? అని చెప్పడంతో రీతూ కంగారు పడుతూ నవ్వేసింది. ఇక నామినేషన్స్‌లో రీతూ, భరణి, సంజన, పవన్, కళ్యాణ్, సుమన్, దివ్య, గౌరవ్ ఉన్నారు.అందులో మొదట రీతూ – భరణి సేఫ్ కాగా, చివరికి దివ్య – గౌరవ్ మధ్య ఉత్కంఠ నెలకొంది.చివరికి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన గౌరవ్ ఎలిమినేట్ అయ్యాడు. దివ్య సేఫ్ అయింది. నాగార్జున తనూజకి గోల్డెన్ బజర్ వాడుకునే చివరి అవకాశం ఇచ్చారు.దానిని ఉపయోగిస్తే గౌరవ్ సేఫ్, దివ్య ఎలిమినేట్ అయ్యేవారు. కానీ తనూజ గోల్డెన్ బజర్ వాడడానికి నిరాకరించింది. దీంతో ఆమె గోల్డెన్ బజర్ పూర్తిగా వృధా అయింది.