Bigg Boss 9 | బిగ్‌బాస్ హౌస్‌లో నాలుగో వారం నామినేషన్స్ ప్రక్రియ మరింత ఆసక్తికరంగా జరిగింది. ఈసారి నామినేషన్ చేసే అవకాశాన్ని అందరికీ ఇవ్వలేదు బిగ్‌బాస్. ముందుగా జరిగిన ఇమ్యూనిటీ టాస్క్‌లో తనూజ, సుమన్ శెట్టి గెలిచారు. వీరిద్దరూ ఈ వారం నామినేషన్ నుంచి సేవ్ అయ్యారు. హౌస్‌మేట్స్‌ను బిగ్‌బాస్ నాలుగు టీములుగా విభజించాడు. ఒక్కో టీమ్ ముగ్గురు సభ్యులతో ఉండగా, నామినేట్ చేయాలంటే ముందుగా గేమ్‌లో గెలవాలి. మొదట గేమ్‌లో గెలిచిన సుమన్ శెట్టి టీమ్ (సుమన్ శెట్టి, ఫ్లోరా, రాము రాథోడ్) రీతూ చౌదరిని నామినేట్ చేసింది.మళ్లీ అదే టీమ్ గెలిచినప్పుడు సంజనను నామినేట్ చేశారు.
సంజన నామినేషన్ సమయంలో రాము చెప్పిన కారణాలు హాట్ టాపిక్ అయ్యాయి. ఆమె కారణంగా హౌస్‌లో హార్మొనీ దెబ్బతింటుందని, కొన్ని కామెంట్లు కూడా బాగాలేదని రాము అభిప్రాయపడ్డాడు. దీనిపై సంజన తీవ్రంగా స్పందించి, “వయలెన్స్ అర్థమేంటో తెలుసా?”, “ఇంగ్లీష్ వస్తుందా నీకు?” అంటూ రాముపై మండిపడింది. దీంతో ఇద్దరి మధ్య కాస్త డిస్కషన్ నడిచింది. ఇంకోసారి నామినేట్ చేయాల్సినప్పుడు ఫ్లోరా హరీష్‌ని టార్గెట్ చేసింది. “మీరు నన్ను బెదిరించారు”, “మీకు నమ్మకం లేదు”, అంటూ కఠినమైన ఆరోపణలు చేసింది. హరీష్ మాత్రం వాటిని ఖండిస్తూ, “మీరు కన్వీనియన్స్ బట్టి మారిపోతారు” అని తన వాదన వినిపించారు.
వంట విషయంలో కూడా గొడవలు మళ్లీ ముదిరాయి. తనూజ, హరీష్ మధ్య మాటల తూటాలు పేలాయి. తనూజ, “మీరు రెండు రోజులు చేసిన పనికి సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నారు అని హరీష్‌ను నిలదీశారు. దీనికి హరీష్ తనదైన శైలిలో వ్యంగ్యంగా స్పందించాడు. మొత్తానికి ఈ వారం నామినేషన్లో ఉన్నవారు ఎవరంటే.. ఫ్లోరా, హరీష్, రీతూ చౌదరి, దమ్ము శ్రీజ, సంజన, దివ్య నికితా. బిగ్‌బాస్ హౌస్‌లో నామినేషన్స్‌తో పాటు వ్యక్తిగత విమర్శలు, ఘర్షణలు పెరుగుతుండటంతో వీక్షకుల ఆసక్తి పెరుగుతోంది. ఈ వారం ఎలిమినేషన్ ఎవరు అవుతారనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.