Bigg Boss 9 | బిగ్ బాస్ హౌజ్‌లో ఐదో రోజు ఎపిసోడ్ ఆసక్తికర పరిణామాలతో సాగింది. హౌజ్‌కి తొలి కెప్టెన్ ఫైనల్ కావడం హైలైట్‌గా నిలిచింది. కెప్టెన్సీ టాస్క్ గేమ్‌లో చివరి వరకు నిలిచిన శ్రీజ గెలుపొందగా, ఆమె గెలుపుకి కారణమైన సంజనను కెప్టెన్‌గా ప్రకటించింది. దీంతో సంజనా మొదటి కెప్టెన్‌గా ఎంపికై, వారం రోజులపాటు లగ్జరీ ఫెసిలిటీస్ పొందే అవకాశం దక్కించుకుంది. కెప్టెన్సీ తర్వాత సంజనా తన రూమ్‌లోకి శ్రీజ, మనీష్‌లను ఎంచుకోవడంతో హౌజ్‌లో చర్చలు మొదలయ్యాయి. ఇమ్మాన్యుయెల్, భరణి ఒక గ్రూప్‌గా, హరీష్, ప్రియా, మనీష్‌లు మరో గ్రూప్‌గా, అలాగే రీతూ, పవన్ కళ్యాణ్, పవన్ వేరే వర్గంగా మారారు.
మరోవైపు సంజనా–తనూజ క్లోజ్‌గా మాట్లాడుకున్నారు. ప్రత్యర్థి టీమ్ సభ్యురాలు అయిన కూడా ఆమెని కెప్టెన్‌గా చేశారని హరీష్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక ఇమ్మాన్యుయెల్ తనపై వస్తున్న బాడీ షేమింగ్ కామెంట్లపై అసంతృప్తి వ్యక్తం చేయగా, భరణి ఆయనకు సపోర్ట్ ఇచ్చాడు. ఇదిలా ఉంటే కెప్టెన్ సంజనా తనూజకు వంటలో స్పెషల్ ఆర్డర్ ఇవ్వడం వివాదానికి దారితీసింది. దీనిపై తనూజ ఆగ్రహం వ్యక్తం చేస్తూ రచ్చ చేసింది. “ఇంటి లోపల ప్రతిరోజూ ఫుడ్ కోసం గొడవలు తప్పడంలేదు” అని ఇమ్మాన్యుయెల్ వ్యాఖ్యానించడం గమనార్హం. కెప్టెన్ అయ్యాక కూల్‌డ్రింక్స్‌ను కంటెస్టెంట్స్‌కి పంచాలనుకున్న సంజనా, “ముందు నన్ను ఇంప్రెస్ చేయాలి” అనే కండిషన్ పెట్టింది. దీనికి హరీష్ దొంగతనానికి తెగబడ్డాడు. ఈ సరదా సీన్ తర్వాత, ఇమ్మాన్యుయెల్ అడగడంతో హౌజ్‌మేట్స్‌ని జంతువులతో పోల్చింది సంజనా.
రీతూ – చిరుత, పవన్ కళ్యాణ్ – బ్లాక్ పాంథర్, భరణి – సింహం, ప్రియా – ఎలుగుబంటి, శ్రష్టి – నక్క, తనూజ – ఉడుత, హరీష్ – హైనా, శ్రీజ – ఎలుక, సుమన్ శెట్టి – తాబేలు, మనీష్ – ఆనకొండ, ఫ్లోరా సైనీ – కోతి, ఇమ్మాన్యుయెల్ – ఏనుగు, తాను – పులి అని పేర్లు పెట్టింది.ఆ తర్వాత హౌజ్‌లో ఫన్నీ స్కిట్ ప్రదర్శించారు. భార్యాభర్తల మధ్య జరిగే గొడవల ఆధారంగా రెండు కుటుంబాల మధ్య జరిగే కామెడీని “బతుకు జట్కా బండి” స్టైల్లో నడిపించారు. ఇందులో ఇమ్మాన్యుయెల్ – కూతురు, ప్రియా – తల్లి, సుమన్ శెట్టి – కొడుకు, శ్రీజ – అత్త, పవన్ కళ్యాణ్ – భర్త, రీతూ చౌదరీ – చెల్లి, భరణి – లాయర్, తనూజ – యాంకర్‌గా ఆకట్టుకున్నారు. స్కిట్ ఆద్యంతం నవ్వులు పూయించగా, ఎపిసోడ్‌కి హైలైట్‌గా నిలిచింది. చివరగా కెప్టెన్ సంజనా బాగా పర్ఫామ్ చేసిన వారికి థంబ్స్‌అప్ బాటిల్స్ గిఫ్ట్‌లుగా ఇచ్చింది. మొత్తంగా, ఐదో రోజు ఎపిసోడ్లో కెప్టెన్సీ రేసు, గ్రూపుల రాజకీయాలు, ఫుడ్ ఫైట్స్, ఫన్నీ మోమెంట్స్ అన్నీ కలిసి పూర్తి ఎంటర్టైన్మెంట్ పంచాయి.