Bigg Boss 9 |బిగ్ బాస్ తెలుగు 9లో శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్ పూర్తిగా బాలల దినోత్సవ స్పెషల్‌గా సాగింది. ఈ సందర్భంగా బిగ్ బాస్ కంటెస్టెంట్ల చిన్నప్పటి ఫోటోలను చూపించి, వాటి వెనుక ఉన్న జ్ఞాపకాలను పంచుకోవాలని సూచించారు. ఈ ఎపిసోడ్లో ఇమ్మాన్యుయెల్, సుమన్ శెట్టి, కళ్యాణ్‌తో పాటు కెప్టెన్‌గా ఉన్న తనూజ కూడా ఎమోషనల్ అయ్యారు. తమ చిన్నప్పటి బాధలు, కుటుంబ పరిస్థితులు, ఎదుర్కొన్న కష్టాలను గుర్తుచేసుకుంటూ పలువురు కన్నీళ్లు పెట్టుకున్నారు.తనూజ తన చిన్నప్పటి జీవితాన్ని గుర్తుచేసుకుంటూ హౌజ్‌ను కంటతడిపెట్టింది. తమ కుటుంబంలో ముగ్గురు ఆడపిల్లలు కావడంతో, వారిని పెంచడం కష్టమేనని బంధువులు తరచూ తల్లిదండ్రులపై ఒత్తిడి చేయడం జరిగేదని ఆమె తెలిపింది.
దీన్ని మనసుకు తీసుకున్న తనూజ తండ్రి, చదువులకంటే పెళ్లి చేయడమే మంచిదని భావించారు . ఈ పరిస్థితుల్లో తమ అమ్మ ధైర్యంగా నిలిచి, తమ భవిష్యత్తు పాడుకాకుండా తగు చర్యలు తీసుకున్నట్టు తనూజ ఎమోషనల్ అవుతూ చెప్పింది. ఎవరికీ తెలియకుండా చిన్న చెల్లిని అమ్మమ్మ ఇంటికి పంపి, తనూజను, మరో చెల్లిని తీసుకుని హైదరాబాద్‌కు వచ్చి, అక్కడే పని చేస్తూ చదివించిందని భావోద్వేగంతో గుర్తుచేసుకుంది. ఆ తరువాత నాన్నతో సంబంధాలు మెరుగుపడి మళ్లీ ఇంటికి తీసుకువెళ్లిన విషయాన్ని కూడా పంచుకుంది. తనూజ మాట్లాడుతూ, “నేను ఈ స్థాయికి రావడానికి కారణం మా అమ్మే. ఆమె నా హీరో… నా సావిత్రినే నా హీరో” అని చెప్పినప్పుడు హౌజ్‌లోని అందరూ మౌనంగా ఉంటూ కాస్త ఎమోషనల్ అయ్యారు.
అయితే తనూజ కెప్టెన్ అయ్యాక, భరణి ఆమెను ఎత్తుకుని సెలబ్రేషన్ చేయడం చూసి దివ్య అలిగింది. “నేను కెప్టెన్ అయినప్పుడు నన్నెత్తుకున్నావా?” అంటూ ప్రశ్నించింది. దీనికి భరణి, “ఆమె క్లోజ్, నువ్వు అంత క్లోజ్ కావు” అని చెప్పడంతో దివ్య కొంచెం ఆగ్రహంతో అక్కడి నుండి వెళ్లిపోయింది. ఇక ఎపిసోడ్ చివర్లో ఇమ్మాన్యుయెల్ చేసిన కామెడీ పన్స్, ఫన్నీ యాక్షన్స్ హౌజ్‌లో నవ్వులు పూయించాయి. ఈ ఎపిసోడ్ మొత్తం భావోద్వేగాలు, ఫన్, డ్రామాతో మేళవించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. బిగ్ బాస్ తెలుగు 9 పదో వారం మరింత ఇంట్రెస్టింగ్గా మారుతుందని స్పష్టమవుతోంది.