Bigg Boss 9 | బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ఎంటర్ అయిన అయేషా హౌస్ నుంచి బయటకు వెళ్తుందన్న వార్తలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. సీజన్ 9లో ‘ఫైర్ స్టోర్మ్’గా వచ్చిన ఆరుగురు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్‌లో ఒకరైన అయేషా తన ఎనర్జిటిక్ గేమ్‌ప్లేతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. హౌస్‌లో అడుగుపెట్టిన మొదటి రోజునుంచే ఆమె సేఫ్ గేమ్ ఆడకుండా పాత కంటెస్టెంట్స్‌ను నేరుగా టార్గెట్ చేస్తూ తనదైన స్టైల్లో ఆడింది. కేవలం రెండు వారాల్లోనే తన గేమ్ స్ట్రాటజీని ప్రేక్షకులకు క్లియర్‌గా చూపించింది. ప్రస్తుతం హౌస్‌లో జరుగుతున్న దొంగల టాస్క్‌లో కూడా ఆమె చురుకుగా పాల్గొంటూ కనిపించింది.
అయితే హెల్త్ ఇష్యూ కారణంగా ఆమె హౌస్ నుంచి బయటకు వస్తుందన్న వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ వారం నామినేషన్స్‌లో కూడా అయేషా లిస్టులో లేనందున ఈ రూమర్స్ మరింత బలంగా వినిపిస్తున్నాయి. తెలుగు బిగ్ బాస్ సీజన్ 9కు ముందు తమిళ్ బిగ్ బాస్ సీజన్ 6లో కూడా అయేషా 9 వారాల పాటు హౌస్‌లో ఉండి తన ప్రదర్శనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. తెలుగు, తమిళ సీరియల్స్ ద్వారా పాపులర్ అయిన ఆమె ఈసారి కూడా ప్రేక్షకుల మన్ననలు పొందుతోంది.అయితే హెల్త్ ఇష్యూతో ఆమె బయటకు వస్తుందన్న వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది.
అయేషా హెల్త్ చెకప్ కోసం తాత్కాలికంగా బయటకు వెళుతుందా, లేదా పూర్తిగా ఎగ్జిట్ అవుతున్నదా అన్నది త్వరలోనే బిగ్ బాస్ టీమ్ స్పష్టం చేయనుంది. అయేషా ఎగ్జిట్ అయితే, ఇది అభిమానులకు షాకింగ్ న్యూస్ కానే. ఎందుకంటే, ఆమె ఈ సీజన్లో చివరి వరకు ఉంటానని హోస్ట్ నాగార్జునకు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. మరోవైపు తన ఆట తీరుతో అశేష అభిమానాన్ని సంపాదించుకుంది. కాగా, సీజన్ 9 గత సీజన్స్ కన్నా భిన్నంగా వెరైటీ టాస్క్‌లతో రసవత్తరంగా సాగుతుంది.