Bigg Boss 9 |బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో 80వ రోజు కి సంబంధించిన ఎపిసోడ్ పూర్తి ఎంటర్టైన్మెంట్తో సాగింది. ఈసారి హౌస్‌లోకి ప్రత్యేకంగా మాజీ కంటెస్టెంట్లైన ప్రేరణ, దేత్తడి హారిక, మానస్ లాంటి వారు ప్రవేశించి కంటెస్టెంట్లతో పోటీ పడటంతో హౌస్‌లో టెన్షన్ వాతావరణం నెలకొంది. వీరితో జరిగిన టాస్క్‌లలో విజయం సాధించిన హౌస్‌మేట్స్‌కు కెప్టెన్సీ కంటెండర్ అవకాశాలు లభించాయి. వారిలో ఎవరు గెలిచినా హౌస్ యొక్క చివరి కెప్టెన్ అయ్యే అవకాశం ఉంటుంది.మొదట ప్రేరణ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చి కంటెస్టెంట్లతో సరదాగా మాట్లాడింది. తనతో పోటీ పడే వ్యక్తిని ఎంపిక చేయడానికి ప్రేరణ సిద్ధమయ్యాక, అందరూ ఆమెతో టాస్క్ చేసే ఛాన్స్ ఇవ్వాలని కోరుకున్నారు.
తనూజ చాకచక్యంగా ప్రేరణను పొగుడుతూ తనకే అవకాశం ఇవ్వాలని కోరగా, ప్రేరణ ఆమెను ఎంచుకుంది. అయితే టేబుల్లోని హోల్స్‌లో బాల్స్ వేయాల్సిన ఈ పోటీలో తనూజ తేలిపోయి, ప్రేరణ విజయం సాధించింది. దీంతో తనూజ కెప్టెన్సీ అవకాశాన్ని కోల్పోయింది. ఈలోపు హౌస్‌లో భరణి- దివ్య మధ్య మళ్లీ వాగ్వాదం చెలరేగింది. భరణి ఇకపై తక్కువ మాట్లాడటానికి ప్రయత్నిస్తానని చెప్పగా, దివ్య కూడా కౌంటర్ ఇచ్చింది. వాదన వేడెక్కిన తర్వాత భరణి “నీకు నమస్కారం” అని అన్న విషయం దివ్యకు అభ్యంతరం కలిగించింది. అలాంటి మాటలు మాట్లాడవద్దు అని దివ్య కూడా ఫైర్ అయింది. ప్రతిసారీ హౌస్ లో నా ఏజ్ గురించి ఎందుకు ప్రస్తావిస్తున్నావ్ అని భరణి అడిగారు. మీరంతా నాపై జోకులు వేస్తే నేను భరించాలి.. నేను జోకు వేస్తే మాత్రం గొడవ పెట్టుకుంటారు అని దివ్య బాధపడింది.
తర్వాత హౌస్‌లోకి దేత్తడి హారిక ప్రవేశించి, తన ప్రత్యర్థిగా సుమన్ శెట్టిని ఎంచుకుంది. టవర్ నిర్మించే టాస్క్‌లో హారికనే విజేతగా నిలిచింది. అనంతరం బిగ్ బాస్ 5 టాప్ 5 కంటెస్టెంట్ మానస్ ఎంట్రీ ఇచ్చి, తనతో పోటీకి డీమాన్ పవన్‌ను ఎంపిక చేసుకున్నాడు. బంతులను మేకులకు గుచ్చే ఈ టాస్క్‌లో పవన్ అద్భుతంగా ఆడి మానస్‌ను ఓడించి కెప్టెన్సీ కంటెండర్‌గా స్థానం సంపాదించాడు.మొత్తంగా, పాత కంటెస్టెంట్ల రాకతో బిగ్ బాస్ హౌస్‌లో పోటీ ఉత్కంఠత పెరిగి, చివరి కెప్టెన్సీ రేసు మరింత రసవత్తరంగా మారింది.