Bigg Boss 9 | బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో అక్టోబర్ 27న ప్రసారమైన ఎపిసోడ్ ప్రేక్షకులకు విచిత్రమైన అనుభూతిని ఇచ్చింది. 50వ రోజు నామినేషన్స్ ప్రక్రియను బిగ్ బాస్ పూర్తిగా వినూత్నంగా మార్చారు. సాధారణంగా హౌస్మేట్స్ ఒకరినొకరు నామినేట్ చేస్తుంటారు. అయితే ఈసారి నామినేట్ చేసే హక్కును బిగ్ బాస్ ఎలిమినేట్ అయిన సభ్యులకు ఇచ్చారు. దమ్ము శ్రీజ, ప్రియా శెట్టి, ఫ్లోరా షైనీ, మర్యాద మనీష్ వంటి మాజీ కంటెస్టెంట్లు ఒక్కొక్కరుగా హౌస్‌లోకి ప్రవేశించి ప్రస్తుత హౌస్‌మేట్స్‌ను నామినేట్ చేశారు. ప్రతి ఒక్కరు తమ అభిప్రాయాలు, కారణాలు స్పష్టంగా చెప్పడంతో హౌస్‌లో తీవ్ర వాదోపవాదాలు చెలరేగాయి.
మొదటగా ఎంట్రీ ఇచ్చిన ప్రియా శెట్టి, సంజనని నామినేట్ చేసింది. దివ్యను “రోడ్డు రోలర్” అని సంజన చెప్పడం తాను సహించలేకపోయానని తెలిపింది. బిగ్ బాస్ ప్రారంభంలో సంజన నిజాయితీగా కనిపించిందని, కానీ ఇప్పుడు ఆ నిజాయితీ కనిపించడం లేదని ప్రియా తీవ్రంగా వ్యాఖ్యానించింది. తర్వాత హౌస్‌లోకి వచ్చిన మర్యాద మనీష్, కళ్యాణ్‌ని నామినేట్ చేశారు. ఇమ్మాన్యుయేల్‌తో ఓ టాస్క్‌లో కళ్యాణ్ వెన్నుపోటు పొడిచాడని మనీష్ ఆరోపించారు. తాను ఇచ్చిన నామినేషన్ అవకాశాన్ని కళ్యాణ్ వాడకపోవడం నమ్మకద్రోహంగా ఉందని మండిపడ్డారు.
తర్వాత హౌస్‌లోకి వచ్చిన ఫ్లోరా షైనీ, రీతూ చౌదరిపై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ ఆమెను నామినేట్ చేసింది. “రీతూ కేవలం ఫేక్ లవ్ ట్రాక్ కోసం హౌస్‌లో ఉంది. కళ్యాణ్, పవన్‌లతో పబ్లిసిటీ రిలేషన్‌షిప్‌లు మాత్రమే నడిపింది” . ముందుగా కళ్యాణ్ దగ్గర, తర్వాత పవన్ దగ్గర రిలేషన్ క్రియేట్ చేయడానికి ట్రై చేసింది. పవన్‌తో కూడా ఆమె జెన్యూన్‌గా లేదు” అని ఫ్లోరా విమర్శించింది. ఆమె తర్వాత సుమన్ శెట్టికి నామినేట్ చేసే అవకాశం ఇచ్చింది. సుమన్ శెట్టి సంజనను నామినేట్ చేస్తూ, “సంజన కెప్టెన్‌ని గౌరవించదు, చెత్త విషయంలో బిహేవియర్ సరైనది కాదు” అన్నారు. దీనికి సంజన కౌంటర్ ఇస్తూ, “హౌస్‌లోనే వరస్ట్ కెప్టెన్ సుమన్ శెట్టి” అని ఫైర్ అయింది.
తర్వాత హౌస్‌లోకి వచ్చిన దమ్ము శ్రీజ, కళ్యాణ్‌ను నామినేట్ చేసింది. “కళ్యాణ్ అమ్మాయిల పిచ్చోడు. క్యారెక్టర్‌పై మచ్చ వేసినా కూడా స్ట్రాంగ్‌గా రియాక్ట్ అవ్వడం లేదు” అని శ్రీజ తీవ్రంగా విమర్శించింది. శ్రీజ మరో కంటెస్టెంట్‌ను నామినేట్ చేసే అవకాశం మాధురికి ఇచ్చింది. దీనితో మాధురి రీతూను నామినేట్ చేస్తూ బిగ్గరగా అరుస్తూ రచ్చ రచ్చ చేసింది. “నువ్వు పవన్‌కి సపోర్ట్ చేయడానికి వచ్చావా, లేక గేమ్ ఆడడానికి వచ్చావా? నీ రిలేషన్ అన్‌హెల్దీ!” అంటూ మాధురి ఆగ్రహం వ్యక్తం చేసింది. రీతూ కూడా సమాధానం ఇస్తూ, “మాది హెల్దీ బాండింగ్” అంటూ ఘాటుగా రియాక్ట్ అయింది.పవన్ విషయంలో ఇద్దరి మధ్య ఘర్షణ చెలరేగడంతో హౌజ్ దద్దరిల్లింది. ఈ నామినేషన్స్ ఎపిసోడ్ హౌస్‌లో టెన్షన్ పెంచింది. ప్రతి ఒక్కరి మాటలు, ఆరోపణలు కొత్త కొత్త చర్చలకు దారితీసేలా కనిపిస్తున్నాయి. ఈ వారం ఎవరు నామినేట్ అయ్యారనేది నేటి ఎపిసోడ్లో తెలియనుంది.