Bigg Boss 9 | బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఇప్పుడు కీలక దశలోకి అడుగుపెట్టింది. 13వ వారం ప్రారంభమయ్యే సరికి హౌస్‌లో ఎనిమిది మంది కంటెస్టెంట్లు మాత్రమే మిగిలి ఉన్నారు. ఆదివారం దివ్య ఎలిమినేట్ కాగా, డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా అనే అనిశ్చితి ముగిసింది. అయితే 13వ వారం డబుల్ ఎలిమినేషన్ జరుగుతుందా? అనే ప్రశ్న మాత్రం ఇంకా ఆసక్తికరంగానే ఉంది. ఈ నేపథ్యంలో సోమవారం ప్రసారమైన నామినేషన్స్ ఎపిసోడ్ పూర్తిగా డ్రామా, ఘర్షణలు, కామెడీతో నిండిపోయింది.
నామినేషన్‌ల్లో మొదటగా ఇమ్మాన్యుయెల్ రీతూ చౌదరిని నామినేట్ చేశాడు. తనపై నమ్మకం పెట్టుకుని తిరిగి అదే నమ్మకానికి విరుద్ధంగా ప్రవర్తించిందని ఆరోపించాడు. దీనికి రీతూ సూటిగా కౌంటర్ ఇస్తూ, “అక్కడో మాట ఇక్కడో మాట చెబుతావు” అని స్పందించడంతో వాగ్వాదం తీవ్రంగా పెరిగింది. తరువాత డీమాన్ పవన్‌ను నామినేట్ చేస్తూ, రెబల్ టాస్క్ సమయంలో తనను తీయడం బాధ కలిగించిందని చెప్పాడు ఇమ్మాన్యుయెల్. ఇక భరణి సంజనను నామినేట్ చేస్తూ, మెడిసన్ విషయంలో ఫ్రాంక్ చేసిన విషయంపై అసహనం వ్యక్తం చేశాడు. పవన్‌ను నామినేట్ చేస్తూ.. “10 రోజులుగా కనిపించడం లేదు, నీ గేమ్ నువ్వే ఆడు” అని చురకలు వేశాడు. దీనికి పవన్ కూడా డైరెక్ట్‌గా స్పందిస్తూ ఈ వారం “ఫస్ట్ టికెట్ టు ఫినాలే నేను కొడతా” అని ప్రకటించాడు.
రీతూ.. సుమన్ శెట్టిని కెప్టెన్సీ టాస్క్‌లో సీరియస్‌గా ఆడలేదని నామినేట్ చేసింది. సంజన “బ్యాక్ స్టాంప్” చేస్తున్నట్టు ఆరోపిస్తూ నామినేట్ చేయగా, ఇద్దరి మధ్య హీట్ పెరిగింది.తనూజ , ఇమ్మాన్యుయెల్ మధ్య కూడా ఘర్షణ చోటుచేసుకుంది. తన పర్సనల్ విషయాలు షేర్ చేసిన ప్రతిసారి ఇమ్మాన్యుయెల్ తనను నామినేట్ చేస్తున్నాడని తనూజ ఆరోపించగా, తాను ఎల్లప్పుడూ సపోర్ట్ చేశానని ఇమ్మాన్యుయెల్ ఎమోషనల్ అయ్యాడు. ఇక ఎపిసోడ్లో హైలైట్ సుమన్ శెట్టి అని చెప్పాలి. నువ్వు నామినేషన్స్‌లో ఉండడం లేదు, ఈ సారైన నామినేషన్లో ఉండు. కాస్త అరవడం తగ్గించుకో అనడంతో అంతా నవ్వేశారు. మరోవైపు డీమాన్ పవన్‌ని నామినేట్ చేస్తూ నీ హెల్త్ బాగా లేదు, నువ్వు ఇప్పుడు ఇంటికెళ్లి రెస్ట్ తీసుకోవడం అవసరం అని నామినేట్ చేయడం గమనార్హం. దీంతో హౌజ్ మేట్స్ నవ్వాపుకోలేకపోయారు. ఇక సంజనా పవన్‌ను ఓవర్ కాన్ఫిడెన్స్ తగ్గించుకోవాలని నామినేట్ చేసింది. “నువ్వే ఫినాలే టికెట్ కొడితే మిగతా వాళ్లు కొట్టారా?” అని ప్రశ్నించింది. అలాగే రీతూని కూడా నామినేట్ చేసింది.
ఇక చివరి వారానికి కెప్టెన్ అయిన కళ్యాణ్‌కు ఒక ప్రత్యేక నామినేషన్ అధికారం ఇవ్వడంతో, నామినేషన్లో లేని భరణిని నేరుగా నామినేట్ చేశాడు. దీంతో 13వ వారం నామినేట్ అయిన కంటెస్టెంట్లు చూస్తే.. సంజనా, రీతూ చౌదరి, డీమాన్ పవన్, సుమన్ శెట్టి, తనూజ, భరణి