Bigg Boss-7 Telugu | రైతు బిడ్డ అంటూ బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్ టాప్-5 కంటెస్టెంట్లలో ఒకడిగా దూసుకుపోతున్నాడు. సీజన్ స్టార్ట్ అయిన మొదట్లో రతికతో పులిహోర కలపడాలు.. రైతుబిడ్డ అంటూ మాటిమాటికి చెప్పడాలు వంటివి పల్లవి ప్రశాంత్‌పై కొంచెం నెగెటివిటీ ఏర్పడేలా చేసింది. బిగ్‌బాస్ ఫ్యాన్స్ చాలా మంది పల్లవి ప్రశాంత్ తీరుపై అసహనం వ్యక్తం చేసేవారు. మొదటి రెండు వారాల్లో ఎప్పుడెప్పుడు ఎలిమినేట్ అవుతాడా అని చాలా మంది చూశారు. కానీ ఆ తర్వాత మూడో వారం నుంచి టాస్క్‌లు గట్రా బాగా చేయడం, అందరితో కలిసి మెలిసి ఉండటం చేస్తూ ఒక్క సారిగా తనపై మంచి అభిప్రాయాన్ని ఏర్పరుచుకునేలా చేశాడు.
ఇక బిగ్‌బాస్ హౌజ్‌లో మొదటి కేప్టెన్‌గా నిలిచి సంచలనం అయ్యాడు. ప్రస్తుతం బిగ్‌బాస్‌లోని టాప్ కంటెస్టెంట్లలో పల్లవి ప్రశాంత్ ఒకడు. అంతా సాఫీగా జరుగుతున్న టైమ్‌లో పల్లవి ప్రశాంత్‌కు సంబంధించిన పెళ్లి ఫోటో ఒకటి సోషల్ మీడియాను ఊపేస్తుంది. పల్లవి ప్రశాంత్‌కు ముందే పెళ్లి అయిపోయిందని.. తాను కోటీశ్వరుడని ప్రచారాలు మొదలయ్యాయి. తాజాగా వాటిపై పల్లవి ప్రశాంత్ తండ్రి క్లారిటీ ఇచ్చాడు. అందరూ అనుకున్నట్లు పల్లవి ప్రశాంత్ కోటీశ్వరుడు కాదని, అవన్నీ అవాస్తవాలేనని చెప్పాడు. బిగ్ బాస్ హౌజ్ నుంచి రాగానే పెళ్లి కూడా చేయాలనుకుంటున్నామని చెప్పుకొచ్చాడు.
దాంతో పల్లవి ప్రశాంత్‌కు ఇంకా పెళ్లి కాలేదని క్లారిటీ వచ్చింది. అయితే ఆ ఫోటో షార్ట్‌ఫిలిం కోసమే.. లేదంటే ఏదైనా వీడియో కోసమే అయి ఉంటుందని అర్థమవుతుంది.