బిగ్‌బాస్ అయినా ఎవరైనా సరే ధమ్ ధమ్ లాడిస్తా అంటూ బిగ్‌బాస్ స్టేజిపైనే బోల్డ్‌గా రెచ్చిపోయి తొలిరోజే అందరి దృష్టిని ఆకర్షించింది ఐదో సీజన్ 13వ కంటెస్టెంట్ సరయు. స్టేజిపై ఈమె బూతులు మాట్లాడటమే కాకుండా ఏకంగా నాగార్జునతో నోటి నుంచి కూడా మింగకు అని అనిపించేసింది.
అవి చూసిన ఆడియన్స్ అమ్మో ! ఈ అమ్మాయేంటి ఇంత బోల్డ్‌గా ఉందంటూ ముక్కుపై వేలేసుకునేలా చేసింది. ఈమె గురించి తెలియని వాళ్లకు ఇది చాలా ఓవర్‌డోస్‌గా అనిపించొచ్చు. కానీ యూట్యూబ్‌లో వెబ్‌సిరీస్‌లు చూసేవారికి బిగ్‌బాస్ స్టేజిపై ఆమె మాట్లాడిన బూతులు కేవలం శాంపిల్గానే అనిపిస్తాయి. ఎందుకంటే 7 ఆర్ట్స్ బ్యానర్లో సరయు చేసిన వీడియోల్లో ఆమె మాట్లాడే బూతులు అంతకుమించి అన్నట్టుగా ఉంటాయి. బోల్డ్‌గా మాట్లాడటమే కాకుండా అందాల ఆరబోతతో యూట్యూబ్‌లో తనకంటూ సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సొంతం చేసుకుంది.
7 ఆర్ట్స్‌కు రాకముందు సరయు బాహుబలితో ఫేమస్ అయిందని తెలుసా ! అదెలా అంటారా.. బాహుబలి మొదటి పార్ట్ రిలీజైన తర్వాత అందరి నోట ఒకటే ప్రశ్న. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు? దీనికి సమాధానం తెలియక చాలామంది తలలు పట్టుకున్నారు. అలాంటి సమయంలో తెలుగువన్ యూట్యూబ్ ఛానల్ ఒక స్పూఫ్ తీసింది. దీనిపై బాహుబలి డైరెక్టర్ రాజమౌళి కూడా ప్రశంసలు కురిపించాడు. దీంతో ఈ స్పూఫ్ మరింత ఫేమస్ అయింది. అయితే ఈ స్పూఫ్లో దేవసేన పాత్రలో నటించింది ఎవరో కాదు సరయు. ఈ పాత్రతో వచ్చిన గుర్తింపు తర్వాత పలు సినిమాలకు బోల్డ్ రివ్యూలు చెబుతూ ఫేమస్ అయింది.
ముఖ్యంగా రజినీకాంత్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన రోబో 2 రివ్యూలో ఈమె మాట్లాడిన బూతులు అంతా ఇంతా కాదు. ఈ రివ్యూలో సరయు మాట్లాడిన బూతులకు ఓ రేంజ్లో క్రేజ్ వచ్చింది. దీంతో అదే యాసను ఫాలో అవుతూ.. 7 ఆర్ట్స్ బ్యానర్లో పలు వెబ్ సిరీస్‌లు చేసింది. నెటిజన్లతో ఓరినాయనో ఇవేం బూతులురా అని అనిపించింది. అక్కడ వచ్చిన క్రేజ్‌తో తాజాగా బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5లోకి అడుగు పెట్టింది. మరి ఈ బోల్డ్ బ్యూటీని ఫేమస్ చేసిన ఆ వెబ్ సిరీస్‌లు ఏంటో మీరు ఒకసారి లుక్కేయండి