నామినేషన్ ప్రక్రియలో భాగంగా ముందుగా బిగ్ బాస్.. అనీ మాస్టర్ని ఇంట్లోని ఎవరైన నలుగురిని డైరెక్ట్‌గా నామినేట్ చేసి.. జైలులో బంధించాల్సి ఉంటుందని చెప్పారు . దీంతో అనీ మాస్టర్ రెండో ఆలోచన లేకుండా ఫస్ట్ కాజల్‌ని నామినేట్ చేసి జైలులో వేసింది. ఆ తరువాత సన్నీని నామినేట్ చేస్తూ.. ఇప్పటివరకూ అందర్నీ నామినేట్ చేశాను కానీ నిన్ను నామినేట్ చేయలేదు అందుకే ఈవారం సన్నీని చేస్తున్నా అంటూ చెప్పింది . ఆ తరువాత మానస్, షణ్ముఖ్‌లను నామినేట్ చేసింది అనీ.
మొత్తంగా ఫస్ట్ లెవల్ నామినేషన్స్‌లో హౌస్ కెప్టెన్‌గా ఉన్న ఆనీ మాస్టర్.. మానస్, షణ్ముఖ్, కాజల్, సన్నీ ఈ నలుగురిని నామినేట్ చేసింది. ఇక బజర్ మోగిన వెంకటనే పింకీ పరుగున వెళ్లి లోపల ఉన్న సంకెళ్లను చేజిక్కించుకుంది. దీంతో ఆమె మానస్‌ని బయటకు తీసుకొచ్చింది. బయటకు వచ్చిన మానస్.. రవి, జెస్సీలను నామినేట్ చేస్తూ జెస్సీని జైలుకి పంపారు. ఆ తర్వాత సిరి సంకెళ్లను అందుకుంది. దీంతో ఆమె జెస్సీని బయటకు తీసుకొచ్చింది.
బయటకు వచ్చిన జెస్సీ.. మానస్, ప్రియాంకలను నామినేట్ చేస్తూ.. మానస్‌ని జైలుకి పంపారు. ఆ తర్వాత జెస్సీకి సంకెళ్లు దక్కగా, షణ్ముఖ్‌ని బయటకు తెచ్చాడు. బయటకు వచ్చిన షణ్ముఖ్.. పింకీ,సిరిలను నామినేట్ చేస్తూ పింకీని జైలుకి పంపాడు. దీంతో బాగా హర్ట్ అయిన పింకీ.. ‘ఉన్న నలుగురిలో వేరే ఆప్షన్ లేదని నన్ను నామినేట్ చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదు. నా పాయింట్లో నువ్వు కరెక్ట్ కాదు. తరువాత ఎప్పుడైనా నన్ను నామినేట్ చేయాలనుకుంటే సరైన కారణం ఇవ్వు’అని మండిపడింది. ‘నా పాయింట్లో ఇదే కరెక్ట్.. నేను ఇలానే నామినేట్ చేస్తా. అది నా ఇష్టం’అంటూ షణ్ముఖ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.