పెళ్లిచూపులు, డియర్ కామ్రెడ్, దొరసాని, అన్నపూర్ణ ఫొటోస్టూడియో వంటి విభిన్న చిత్రాలను నిర్మించి, తరుణ్‌భాస్కర్, భరత్ కమ్మ, కేవీ మహేంద్ర, సంజీవ్‌రెడ్డి వంటి అభిరుచి గల దర్శకులను పరిశ్రమకి పరిచయం చేసిన ‘బిగ్‌బెన్ సినిమాస్’ సంస్థ త్వరలో మరో డైరెక్టర్ని ఇండస్ట్రీకి అందించనుంది. తనెవరో కాదు, డబ్బింగ్ ఆర్టిస్టుగా, ఆర్జేగా గుర్తింపు తెచ్చుకున్న శ్వేత పీవీఎస్.
‘ఉప్పెన’ సినిమాలో కృతిశెట్టికి డబ్బింగ్ చెప్పిందే శ్వేతే కావడం విశేషం. ఆదివారం ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. తమ సంస్థలో వచ్చిన గత చిత్రాల కోవలోనే ఈ సినిమా కూడా రిచ్ కంటెంట్‌తో, న్యూకాన్సెప్ట్తో ఉంటుందని వారు తెలిపారు.