వయసు 8 పదులు దాటినా.. ఇంకా వర్క్ ైస్టెల్ విషయంలో కుర్రాళ్లతో పోటీ పడుతుంటారు బిగ్‌బీ అమితాబ్. రీసెంట్గా సోషల్ మీడియాలో ఆయన పెట్టిన ఓ పోస్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఐదు సినిమాలు, రెండు ఫొటోషూట్ల వర్క్‌ని కేవలం రెండు గంటల్లో పూర్తి చేశానని అమితాబ్ ఈ పోస్ట్‌లో పేర్కొన్నారు. దాంతో ఇప్పుడు ఆ పోస్ట్ బీటౌన్‌లో చర్చనీయాంశమైంది. ‘పనిచేయడంలో ఆనందం ఉంటుంది. రీసెంట్గా రెండు గంటల్లో అయిదు సినిమాలు, రెండు ఫొటోషూట్ల వర్క్‌ని కంప్లీట్ చేశా. అవన్నీ వాణిజ్య ప్రకటనల కోసమే అయినా.. ఇంత స్పీడ్‌గా వర్క్ చేయడం మాత్రం ఆనందంగా, గర్వంగా ఉంది.’ అని పేర్కొన్నారు బిగ్‌బీ.
ఇంకా చెబుతూ ‘నా వర్క్ స్పీడ్‌ని చూసి డైరెక్టర్‌తోపాటు డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంతా నివ్వెరపోయారు. ‘మీరు పనిచేసే విధానాన్ని పాడు చేస్తున్నారు..’ అంటూ ఆ దర్శకుడు నవ్వుతూ చమత్కరించాడు. సినిమా పరిశ్రమపై వేలాదిమంది ఆధారపడి బతుకుతుంటారు. వారికోసమే నేను ఎక్కువ గంటలు పనిచేస్తుంటా. నాలాంటి వాళ్లు ఎంత పనిచేస్తే.. వారికి అంత పని దొరుకుతుంది.’ అంటూ చెప్పుకొచ్చారు అమితాబ్. ఈ పోస్ట్ చూసిన వారంతా, నేటితరం హీరోలు అమితాబ్‌ని చూసి నేర్చుకోవాల్సింది ఎంతైనా ఉందంటూ సోషల్ మీడియాలో బిగ్‌బీకి హర్షం వ్యక్తం చేస్తున్నారు.