NBK 109 | ప్రస్తుతం కేఎస్ రవీంద్ర(బాబీ) దర్శకత్వంలో బాలకృష్ణ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇంకా పేరు నిర్ణయించని ఈ సినిమాలో ఊర్వశీరౌతేలా, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికలుగా నటిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మాతలు. ఇటీవలే జైపూర్లో భారీ షెడ్యూల్ ముగించుకొని చిత్ర యూనిట్ హైదరాబాద్ చేరుకుంది. ఈ నెల చివరి వారం నుంచి హైదరాబాద్లో తాజా షెడ్యూల్ మొదలు కానున్నదని సమాచారం. ఈ షెడ్యూల్లో ైక్లెమాక్స్కి సంబంధించిన భారీ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తారట. ఇందులో బాలయ్య రెండు కోణాలున్న పాత్రలో కనిపిస్తారని, బాలయ్య అభిమానులే కాక, అన్ని వర్గాల ప్రేక్షకులూ ఎంజాయ్ చేసేలా సినిమా ఉంటుందని యూనిట్ వర్గాలు చెబుతున్నాయ్. బాబీడియోల్ విలన్గా నటిస్తున్న ఈ చిత్రంలో చాందినీ చౌదరి కీలక పాత్ర పోషిస్తున్నది. తమన్ ఈ సినిమానికి స్వరాలందిస్తున్న విషయం తెలిసిందే.