Bichagadu-2 Movie On OTT | ఏడేళ్ల క్రితం వచ్చిన బిచ్చగాడు సినిమా విజయ్ అంటోనికి తెలుగులో మంచి క్రేజ్‌ను, మార్కెట్‌ను తెచ్చిపెట్టింది. అప్పట్లో ఈ సినిమా నెలకొల్పిన రికార్డులు అంతా ఇంతా కాదు. ఇక ఈ సినిమాకు రెండో పార్టు ఇటివలే విడుదలై సూపర్ హిట్టయింది. నిజానికి ఈ సినిమాకు తెలుగులో ఘోరంగా రివ్యూలు వచ్చాయి. కానీ టాక్‌తో సంబంధంలేకుండా తమిళ కలెక్షన్లకు ధీటుగా ఇక్కడ కోట్లు కొల్లగొట్టింది. కాగా ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ+హాట్‌స్టార్‌లో గత అర్థ రాత్రి నుంచి ఈ సినమా స్ట్రీమింగ్ అవుతుంది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా అందుబాటులో ఉంది. ఇక ‘బిచ్చగాడు’ అనే బ్రాండ్ నేమ్ తప్పితే తెలుగులో పార్ట్-2పై ఏమంత బజ్ ఏర్పడలేదు. ప్రమోషన్లు గట్రా భారీ స్థాయిలో జరుపలేరు. ఇక టీజర్, ట్రైలర్లు సైతం సినిమాపై ఓ మోస్తరు అంచనాలే క్రియేట్ చేశాయి. గట్టిగా మాట్లాడితే పబ్లిసిటీ ఖర్చులు కూడా వేళ్ల మీద లెక్కేయోచ్చు అనే మాటలు కూడా వినిపించాయి. ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఈ సినిమాను టాప్ బయర్లు కూడా కొనలేదు. వెస్ట్ గోదావరి లోకల్ బయ్యర్ ఈ సినిమా హక్కులను దక్కించుకున్నాడు. ఇక శుక్రవారం రిలీజైన ఈ సినిమా మిక్స్డ్ టాకే తెచ్చుకుంది. పాత కథలనే మిక్సీలో వేసి చూపించాడని బోలెడు నెగెటీవ్ కామెంట్స్ వచ్చాయి.
కట్ చేస్తే తొలిరోజే కళ్లు చేదిరే కలెక్షన్లు సాధించింది. తమిళ కలెక్షన్లకు ఏమాత్రం తగ్గని రేంజ్లో ఈ సీక్వెల్‌కు తెలుగు కలెక్షన్లు వచ్చాయి. బిచ్చగాడు-2 తొలిరోజే దాదాపు రూ.4 కోట్లకు పైగా గ్రాస్‌ను కలెక్ట్ చేసింది. టాలీవుడ్ మీడియం రేంజ్ హీరోలు కూడా ఈ మధ్య ఆ రేంజ్ కలెక్షన్లు సాధించలేకపోయారు. మణిరత్నం ఎపిక్ డ్రామా పొన్నియన్ సెల్వన్ సైతం ఈ సినిమాకు దరిదాపుల్లో కూడా లేదు. దీన్ని బట్టి చూస్తే బిచ్చగాడు సినిమా తెలుగు ప్రేక్షకుల్లో ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో అర్థం చేసుకోవచ్చు. ఫైనల్ రన్లో ఈ సినిమా దాదాపు పది కోట్ల షేర్ సాధించి డిస్ట్రిబ్యూటర్లకు కళ్లు చెదిరే లాభాలు తెచ్చిపెట్టింది. ఏడేళ్ల క్రితం వచ్చిన బిచ్చగాడు తెలుగులో కోట్లు కొల్లగొట్టింది. ఎలాంటి అంచనాల్లేకుండా విడుదలైన ఈ సినిమా అప్పట్లోనే రూ.26 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది.