ధీరవనిత బెలవాడి మల్లమ్మ
పాత్రలపరంగా ప్రయోగాలకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది బాలీవుడ్ కథానాయిక భూమి ఫడ్నేకర్. తాజాగా ఈ భామ చారిత్రక యోధురాలు బెలవాడి మల్లమ్మ పాత్రలో కనిపించనుంది.
పాత్రలపరంగా ప్రయోగాలకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది బాలీవుడ్ కథానాయిక భూమి ఫడ్నేకర్. తాజాగా ఈ భామ చారిత్రక యోధురాలు బెలవాడి మల్లమ్మ పాత్రలో కనిపించనుంది. రిషబ్శెట్టి కథానాయకుడిగా ‘ది ప్రైడ్ ఆఫ్ భారత్ ఛత్రపతి శివాజీ మహారాజ్’ పేరుతో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సందీప్ సింగ్ దర్శకుడు. ఈ సినిమాలో భూమి ఫడ్నేకర్ బెలవాడి సంస్థానాన్ని ఏలిన రాణి మల్లమ్మ పాత్రలో కనిపించనుందని మేకర్స్ తెలిపారు. భారతదేశ చరిత్రలో మహిళా సైన్యాన్ని ఏర్పాటు చేసిన తొలిరాణిగా ఆమె ప్రసిద్ధికెక్కారు. ఛత్రపతి శివాజీ, మల్లమ్మ మధ్య యుద్ధం జరిగిందని, ఇందులో శివాజీని మల్లమ్మ ఓడించిందనే వాదనలు కూడా ఉన్నాయి.
1678 బెలవాడి యుద్ధంలో తన భర్త ఈశ్వరప్రభు దేశాయ్ మరణించినా ఏమాత్రం ధైర్యం కోల్పోకుండా శివాజీ సేనలతో 27 రోజుల పాటు వీరోచిత పోరాటం చేసి బెలవాడి కోటను కాపాడుకున్న ధీరవనితగా ఆమెను చరిత్రకారులు అభివర్ణిస్తారు. ఈ నేపథ్యంలో ఆమె పాత్ర అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. శివాజీ మహారాజ్, బెలవాడి మల్లమ్మ మధ్య జరిగిన పోరును ఈ సినిమాలో ఆవిష్కరించబోతున్నారని, సినిమాలో అది ప్రధానఘట్టంగా ఉంటుందని సమాచారం. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్మీదకు వెళ్లనుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్ను.. సిక్కిం గవర్నర్గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

