బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్గన్ (Ajay Devgn) దర్శకత్వం వహిస్తూ.. లీడ్ రోల్లో నటిస్తున్న చిత్రం భోళా (Bholaa). కార్తీ టైటిల్ రోల్లో మెరిసిన ఖైదీ చిత్రానికి అఫీషియల్ హిందీ రీమేక్‌గా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో టబు కీలక పాత్రలో నటిస్తోంది.
అజయ్‌దేవ్‌గన్ దర్శకత్వంలో వస్తున్న నాలుగో సినిమా భోళా. ఎవరది.. ఆగని శక్తి వస్తోంది.. అంటూ ట్వీట్ చేశాడు అజయ్ దేవ్గన్. 3డీ ఫార్మాట్లో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. యాక్షన్ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని2023 మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్.
అజయ్ దేవ్గన్ ఫిలిమ్స్, టీ-సిరీస్ ఫిలిమ్స్, రిలయన్స్ ఎంటర్టైన్ మెంట్, డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్లపై సంయుక్తంగా తెరకెక్కుతుంది. అజయ్‌దేవ్‌గన్ – శ్రియా కాంబినేషన్లో తెరకెక్కిన దృశ్యం 2 ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా తొలి రోజు నుంచి మంచి టాక్‌తో స్క్రీనింగ్ అవుతుంది.
భోళా టీజర్ అప్డేట్.. వీడియో
KAUN HAI WOH?
An unstoppable force is coming!#BholaaTeaserOutTomorrow #BholaaIn3D#Tabu @ADFFilms pic.twitter.com/sXTiKnzlTJ— Ajay Devgn (@ajaydevgn) November 21, 2022