మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, తమన్నా ప్రధాన పాత్రలలో ‘భోళా శంకర్’ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. తమిళ మూవీ ‘వేదాళం’ రీమేక్‌గా ఈ మూవీ రూపొందుతోంది. చిరు బర్త్‌డే(ఆగష్టు 22) రోజున ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడగా, నేడు ఈ చిత్రం పూజా కార్యక్రమాలు జరుపుకుంటుంది. చిరంజీవితో పాటు పలువురు ప్రముఖులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇక ఈనెల 15 నుంచి ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో చిరు విభిన్నమైన లుక్‌లో కనిపించనున్నారు. గుండుతో కూడా కనిపించే అవకాశాలున్నట్లు సమాచారం. అన్నా చెల్లెళ్ల అనుబంధం నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో చిరు చెల్లెలిగా కీర్తిసురేష్ నటిస్తుంది. తమన్నా కథానాయికగా నటించనున్నట్టు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.
భోళా శంకర్ సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తి చేయాలనీ మెగాస్టార్ కండీషన్ పెట్టారట. సినిమా చిత్రీకరణ కు ఎక్కువ సమయం తీసుకోకుండా మొత్తం 40 నుండి 50 వర్కింగ్ డేస్ లోనే ముగించేలా ప్లాన్ చేయాలని మెహర్ రమేష్ తో చెప్పినట్లుగా టాక్ వినిపిస్తుంది. స్వర సాగర్ మహతి చిత్రానికి సంగీతం అందించనున్నారు.
Watch the MEGA LAUNCH of
— BA Raju's Team (@baraju_SuperHit) November 11, 2021
MEGA🌟@KChiruTweets
& @MeherRamesh's
MEGA MASSIVE MOVIE
🔱#BholaaShankar🔱#BholaaShankarLaunch
LIVE here⚡💥
▶️ https://t.co/jo3ntbfnIR@AnilSunkara1 @KeerthyOfficial @tamannaahspeaks @AKentsOfficial @BholaaShankar#MegaEuphoria ✨ pic.twitter.com/kaAFur9z8l
MEGA🌟 @KChiruTweets
— AK Entertainments (@AKentsOfficial) November 11, 2021
& @MeherRamesh's#BholaaShankar🔱
Launched with a grand Pooja ceremony 🪔#BholaaShankarLaunch
📃#KoratalaSiva @directorvamshi @harish2you @megopichand @dirbobby @IamNShankar
🎬@Ragavendraraoba
🎥on #VVVinayak@AnilSunkara1 @AKentsOfficial @tamannaahspeaks pic.twitter.com/O5Cj4e2Rp3
MEGA🌟 @KChiruTweets's
— BA Raju's Team (@baraju_SuperHit) November 11, 2021
🔱#BholaaShankar🔱 cast and crew list 📃#BholaaShankarLaunch @MeherRamesh @AnilSunkara1 @KeerthyOfficial @tamannaahspeaks @AKentsOfficial @BholaaShankar pic.twitter.com/A0PFC6cGE4