ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు టాలీవుడ్ (Tollywood) మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi). ఈ చిత్రాల్లో మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తున్న భోళా శంకర్ (Bhola Shankar) ఒకటి..వేదాళమ్ రీమేక్‌గా తెరకెక్కుతున్నఈ చిత్రంలో మిల్కీ బ్యూటీ తమన్నా (Tamannah) ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. కోలీవుడ్ హీరోయిన్ కీర్తిసురేశ్ (Meher Ramesh) చిరంజీవి సోదరిగా నటిస్తోంది. టీవీ యాంకర్ శ్రీముఖి కీలక పాత్రలో మెరువనున్నట్టు ఇన్ సైడ్ టాక్.
కాగా సినిమా రషెస్ (సీన్లు) పట్ల చిరంజీవి అసంతృప్తిగా ఉండటంతో షూటింగ్ ఆలస్యమవుతుందని ఇప్పటికే ఓ న్యూస్ బయటకు వచ్చింది. అయితే అలాంటిదేమిలేదంటూ తాజాగా మరో అప్ డేట్ తెరపైకి వచ్చింది. భోళా శంకర్ కొత్త షెడ్యూల్ ఈ నెల 21 నుంచి ప్రారంభం కాబోతుందని వార్తలు రాగా.. తాజా న్యూస్ చిరు అభిమానుల్లో జోష్ నింపుతోంది. ఇదిలా ఉంటే మరోవైపు మోహన్ రాజా దర్శకత్వంలో చేస్తున్న గాడ్ ఫాదర్ షూటింగ్ దశలో ఉంది. గాడ్ ఫాదర్ చిత్రీకరణ వీలైనంత త్వరగా పూర్తి చేసే పనిలో ఉన్నాడట చిరు.
ఈ ప్రాజెక్టులో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తుండగా..అతనికి సంబంధించిన షూటింగ్ పార్టు కూడా పూర్తయింది. దీంతోపాటు బాబీ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్గా రాబోతున్న 154 ప్రాజెక్టుపై కూడా ఫోకస్ పెట్టబోతున్నాడు.ఈ సారి పక్కా టైమింగ్‌తో అభిమానులకు కావాల్సిన వినోదాన్ని అందించే పనిలో ఉన్నాడట చిరు.
Read Also : Janhvi Kapoor | క్రేజీ ప్రాజెక్టులో.. ముగ్గురు స్టార్ హీరోయిన్లు !
Read Also : Ranveer VS Wild Teaser | బియర్ గిల్స్ తో రణ్ వీర్ సింగ్ సాహసాలు..గూస్ బంప్స్ తెప్పిస్తోన్న టీజర్
Read Also : Anil Ravipudi | గర్జిస్తున్న సింహానికి పుట్టినరోజు శుభాకాంక్షలు..అనిల్ రావిపూడి ట్వీట్ వైరల్
Read Also : Ante Sundaraniki Review | అంటే సుందరానికీ రివ్యూ..