Bhola Shankar Movie Twitter Review | దాదాపు పదేళ్ల తర్వాత మెహర్ రమేష్ మళ్లీ మెగా ఫోన్ పట్టి చిరుతో సినిమా తీస్తున్నాడంటే ఫ్యాన్స్ టెన్షన్ అంతా ఇంతా కాదు. దానికి కారణం కూడా లేకపోలేదు. మెహర్ రమేష్‌కు ఇప్పటివరకు తెలుగులో ఒక్క హిట్టు కూడా లేదు. హిట్టు సంగతి అటుంచితే.. అన్నీ అల్ట్రా డిజాస్టర్లే. కాస్తో కూస్తో ఆయన ఫిల్మోగ్రఫీలో చెప్పుకోదగినది బిల్లానే. ఇక మెహర్ రమేష్ లాస్ట్ మూవీ షాడో అయితే.. వెంకీ ఫ్యాన్స్‌కు కలలో కూడా భయపడే సినిమానిచ్చాడు. అలా అని మెహర్ రమేష్ డైరెక్షన్‌ను తీసిపాడేయలేం. ఎందుకంటే కన్నడలో ఆయన తీసిన రెండు సినిమాలు సూపర్ డూపర్ హిట్లు. ఇక షాడో తర్వాత పదేళ్లు గ్యాప్ తీసుకుని చిరుతో వేదాళం రీమేక్‌ను ఓకే చేయించుకున్నాడు.
ముందు నుంచి ఈ సినిమాపై కాస్త నెగిటివిటీనే ఉంది. అప్పటికే టాలీవుడ్ జనాలు రీమేక్‌లు చూసి చూసి విసుగెత్తిపోయారు. అందులోనూ తెలుగులో ఆల్రెడీ డబ్ అయిన వేదాళం సినిమాను రీమేక్ చేస్తున్నాడంటే అభిమానుల్లో సైతం ఏమంత ఆసక్తి కనుబరచలేదు. పైగా అప్పటికే లూసిఫర్‌ను గాడ్‌ఫాదర్‌గా రీమేక్ చేసి చేతులు కాల్చుకున్నారు. దాంతో ఈ సినిమాపై పెద్దగా బజ్ ఏర్పడలేదు. టీజర్, ట్రైలర్లు సైతం సినిమాపై ఏమంత హైప్ తీసుకురాలేకపోయాయి. ఇక పాటల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఒక్కటంటే ఒక్క పాట కూడా జనాలకు ఎక్కలేదు. రిలీజ్ ముంగిట సినిమాపై కాస్తో కూస్తో హోప్ ఉందంటే అది మెగాస్టార్ పైనే. వాల్తేరు వీరయ్య వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో చిరు భోళాశంకర్‌పై కాస్త ఎక్కువ ఫోకస్ పెట్టాడని, కథలో కీలక మార్పులు చేశాడని ఇండస్ట్రీలో గట్టిగానే వార్తలు వినిపించాయి.
సరేలే మెగాస్టార్ కథలో ఇన్వాల్వ్మెంట్ తీసుకున్నాడంటే సినిమా బాగుండే ఉంటుందని జనాలు థియేటర్ల వైపు అడుగులు వేస్తున్నారు. కాగా శుక్రవారం ఈ సినిమా భారీ ఎత్తున రిలీజైంది. ఇప్పటికే థియేటర్లు, బాస్ కటౌట్లు, ఫ్లెక్స్‌లతో ముస్తాబయ్యాయి. ఇక చాలా చోట్ల భోళా శంకర్ సినిమా ప్రీమియర్ షోలు పడిపోయాయి. సినిమా చూసిన వారందరు వాళ్ల సమీక్షలు ట్విట్టర్ వేదికగా పంచుకుంటున్నారు. మరీ ట్విట్టర్ టాక్ ఎలా ఉందో చూద్దాం.
చిరు అభిమానుల భయమే నిజమైంది. సినిమాకు మిక్స్డ్ టాక్ వస్తుంది. చిరు ఫ్యాన్స్ సైతం సినిమాను అంతగా ఇష్టపడలేరని రివ్యూలు తెలుపుతున్నారు. బాస్ నటన, కొన్ని సీన్స్, ప్రీ ఇంటర్వెల్ , క్లైమాక్స్ ఇవి తప్పితే సినిమా గురించి చెప్పుకోవడానికి పెద్దగా ఏమి లేదని అంటున్నారు. సినిమా స్టార్ట్ అవ్వడమే 5గేర్ స్పీడ్‌లో సాగిందట. అయితే ముందు ముందుకు వెళ్లే కొద్ది కథనంలో పట్టు తప్పిందని చాలా బోరింగ్‌గా సాగిందని అంటున్నారు. అయితే ప్రీ ఇంటర్వెల్ సీన్ మాత్రం చాలా బాగుందని అంటున్నారు. ఇక సెకండ్ ఆఫ్ మట్టుకు ఫస్ట్ కంటే బెటర్ అని అంటున్నారు. కీర్తి సురేష్‌తో ఉండే సీన్స్ బాగున్నాయని, కొన్ని చోట్ల ఎమోషనల్ సీన్స్ బాగా పండాయని తెలుపుతున్నారు. క్లైమాక్స్ మాత్రం సినిమాను కాపాడిందని అంటున్నారు. సినిమాకు బిగ్గెస్ట్ మైనస్ అంటే సంగీతమనే చెబుతున్నారు. మహతి స్వర సాగర్ పాటలు, నేపథ్య సంగీతం రెండు పెద్దగా ఇంపాక్ట్ చూపించలేవట.
ఇక ప్రొడ్యూసర్లు డబ్బును నీళ్లలా ఖర్చుపెట్టారని అంటున్నారు. అవసరమైన దానికంటే ఎక్కువ మొత్తంలోనే ఖర్చు పెట్టినట్లు సినిమా చూస్తే తెలుస్తుందని అంటున్నారు. డుడ్లే సినిమాటోగ్రఫి మాత్రం బాగుందని అంటున్నారు. కొన్ని సీన్స్ విజువల్ పరంగా అద్భుతంగా కనిపించాయని తెలుపుతున్నారు. ఇక తమన్నా రోల్ పెద్దగా ఆకట్టుకోలేదని, సుశాంత్‌కు మాత్రం కాస్త మంచి రోల్ పడిందని అంటున్నారు. మొత్తంగా భోళా శంకర్ సినిమాకు మిక్స్డ్ టాక్ వస్తుంది. దాదాపు వంద కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకోవాలంటే మౌత్ టాక్ పైనే ఆధారపడి ఉంటుంది. ఇక ఇవి కేవలం ట్విట్టర్ రివ్యూలు మాత్రమే. సినిమా ఎలా ఉందనేది తెలియాలంటే ఒరిజనల్ రివ్యూ వచ్చేంత వరకు వేచి చూడాల్సిందే.
#BholaaShankar interval bang 🥵🔥
Loved the movie so far
Looks Kolkata centiment working out for Mega family @KChiruTweets sir you are acting Everest
Fights little over the boardSongs could have been better but BGM during interval is good pic.twitter.com/GwSa3AD7hz
— స్వాతి అనుముల (@JrNTR00763639) August 10, 2023
#BholaaShankar : ⭐️⭐️
NO-laa
Apart from megastar #Chiranjeevi‘s fine performance, the movie is a dismal and bewildering attempt at remaking #AjithKumar‘s #Vedalam that falls flat on nearly every conceivable level. Director Meher Ramesh’s lack of effort is clearly evident. The… pic.twitter.com/Yd4GlTtwF1
— Manobala Vijayabalan (@ManobalaV) August 11, 2023
#BholaaShankar A Commercial Movie with a few alright action blocks/comedy scenes but nothing else works.
While the 1st half doesn’t work at all, the 2nd half is somewhat ok but still lacks the punch. An Outdated script/storytelling that ends up being below par.
Rating: 2.25/5
— Venky Reviews (@venkyreviews) August 10, 2023