Bhola Shankar Movie Trailer | వాల్తేరు వీరయ్యతో ఊహించని రేంజ్లో హిట్టు కొట్టిన మెగా స్టార్ ఇప్పుడు అదే ఊపుతో భోళా శంకర్‌తో ప్రేక్షకులు ముందుకు వస్తున్నాడు. తమిళంలో కోట్లు కొల్లగొట్టిన వేదాళం సినిమాకు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పటికే రిలీజైన పాటలు, టీజర్ గట్రా సినిమాపై వీర లెవల్లో అంచనాలు క్రియేట్ చేశాయి. ముఖ్యంగా మెగా అభిమానులు మాత్రం ఈ సినిమా కోసం ఈగర్‌గా వేయిట్ చేస్తున్నారు. ఓ వైపు మోహర్ రమేష్ వెనుకున్న ఫ్లాపుల మూట కనిపిస్తున్నా.. మరో వైపు బాస్ సినిమా, అందులోనూ అభిమాని కాబట్టి సినిమాలో స్టఫ్ మాములుగా ఉండదని ధీమాగా ఉన్నారు.
మరో మూడు వారాల్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా చక చక ప్యాచ్ వర్క్ పూర్తి చేసుకుంటుంది. తాజాగా మేకర్స్ ఈ సినిమా ట్రైలర్ అప్డేట్ను ప్రకటించారు. జూలై 27న ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేస్తున్నట్లు ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. చేతిలో కత్తి పట్టుకుని మాస్ అవతారంలో ఉన్న చిరు లుక్ అదిరిపోయింది. ఇప్పటివరకు రిలీజైన పోస్టర్లలో ఈ లుక్ మాత్ర వేరే లెవల్లో ఉంది. ఇక త్వరలోనే మేకర్స్ ప్రమోషన్లు కూడా షురూ చేయనున్నట్లు తెలుస్తుంది.
యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాకు మెహర్ రమేష్ దర్శకత్వం వహించాడు. సిస్టర్ సెంటిమెంట్ ప్రధానంగా సాగే ఈ సినిమాలో కీర్తి సురేష్ చిరుకు చెల్లెలిగా కనిపించనుంది. మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్గా నటించింది. ఏకే ఎంటర్టైనమెంట్స్ బ్యానర్‌పై అనీల్ సుంకర ఈ సినిమాను నిర్మించాడు. సుశాంత్ కీలకపాత్రలో కనిపించనున్నాడు.
#BholaaShankar TRAILER ON 27th JULY 🔥💥
More Exciting Updates Loading for the
MEGA ENTERTAINING ACTION spectacle😎#BholaaShankarOnAug11 pic.twitter.com/TO6IHRhM9b— AK Entertainments (@AKentsOfficial) July 23, 2023