Chiranjeevi | ‘ఖైదీ నెంబర్150’తో అదిరిపోయే రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్.. ఆ తర్వాత అదే జోరు కొనసాగించలేకపోయాడు. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ‘సైరా’ తెలుగులో నెట్టుకొచ్చింది కానీ, మిగితా భాషల్లో కనీసం పోస్టర్ ఖర్చులను కూడా వెనక్కు తీసుకరాలేకపోయింది. ఈ సినిమా ఫలితంతో చిరు ఏకంగా మూడేళ్లు గ్యాప్ తీసుకుని ఆచార్యతో గతేడాది ఏప్రిల్‌లో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. కొడుకు చరణ్‌తో కలిసి చేసిన తొలి సినిమా కావడంతో అటు అభిమానుల్లో ఇటు ప్రేక్షకుల్లో ఎక్కడలేని అంచనాలు క్రియేట్ అయ్యాయి.
పైగా కొరటాల వంటి ఫ్లాప్ ఎరుగని దర్శకుడు ఈ సినిమా తెరకెక్కించడంతో అంచనాలు ఆకాశాన్నంటాయి. కానీ రిలీజ్ తర్వాత బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇప్పటికీ మెగా ఫ్యాన్స్ ఈ సినిమా పేరెత్తితేనే భయపడిపోతుంటారు. అంతలా ‘ఆచార్య’ డిసప్పాయింట్ చేసింది. ఇక ఈ గాయం నుండి కోలుకునేలోపే మెగా అభిమానులకు ‘గాడ్‌ఫాదర్’ రూపంలో మరో దెబ్బ పడింది. ఓ మోస్తరు అంచనాలతో దసరా కానుకగా రిలీజైన ఈ మూవీ తొలిరోజే మిక్స్డ్ రివ్యూలను తెచ్చుకుంది. దాంతో వారం తిరక్కుండానే సగం థియేటర్లను ఖాళీ చేసింది. ఇక మెగాస్టార్ పనైపోయింది. ఆయన సినిమాలను ప్రేక్షకులు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. సినిమాలకు గుడ్ చెప్పాల్సిన టైమ్ వచ్చింది అంటూ ఎన్నో రకాల విమర్శలు చిరుపై మొదలయ్యాయి.
వాటన్నిటిని దాటుకుంటూ ‘వాల్తేరు వీరయ్య’తో విమర్శలు చేసిన నోళ్ళతోనే ప్రశంసలు అందుకున్నాడు. వింటేజ్ చిరు వచ్చాడంటూ మెగా అభిమానులు సంబరాలు చేసుకున్నారు. కథ, కథనం పరంగా చూసుకుంటే అంత గొప్ప సినిమా ఏం కాదు. కానీ బాస్‌లోని కామెడీ టైమింగ్‌ను బాబీ పర్ఫెక్ట్గా వాడుకున్నాడు. అభిమానులు చిరును ఎలా చూడాలనుకుంటున్నారో అలానే చూపించాడు. చిరుకు తోడు మాస్‌రాజా తోడవడంతో సంక్రాంతికి కలెక్షన్ల వరద పారింది. ఈ సినిమా వల్ల డిస్ట్రిబ్యూటర్లకు దాదాపు రూ.50 కోట్లకు పైగా లాభాలు వచ్చాయి.
ప్రస్తుతం చిరు అదే జోష్‌తో ‘భోళాశంకర్’ సినిమా చేస్తున్నాడు. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరిదశలో ఉంది. ఇప్పటివరకు రిలీజైన పోస్టర్లు మంచి అంచనాలే క్రియేట్ చేశాయి. కాగా తాజాగా మే డే సందర్భంగా చిత్రబృందం స్పెషల్ పోస్టర్లను రిలీజ్ చేసింది. చిరు కార్మికుడి కాస్టూమ్‌లో టాక్సీ దగ్గర స్టిల్స్ అదిరిపోయాయి. యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ చిరుకు చెల్లెలిగా నటిస్తుంది. తమన్నా హీరోయిన్గా నటిస్తుంది.
ఇక రెండు, మూడు రోజుల నుంచి ఈ సినిమా విడుదల మరింత ఆలస్యం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా తాజాగా మేకర్స్ ఆ పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టి పోస్టర్లో ముందు నుంచి చెబుతున్న ఆగస్టు 11వ తేదిని పెట్టారు. ఈ సినిమాను ఏకే ఎంటర్టైనమెంట్స్, క్రియేటీవ్ కమర్షియల్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక ఈ మూవీ తమిళంలో సూపర్ హిట్టయిన ‘వేదాళం’కు రీమేక్‌గా తెరకెక్కుతుంది.
కార్మికులు,కర్షకులు, శ్రమ జీవులకు అందరికి మే డే శుభాకాంక్షలు❤️
Team #BholaaShankar honour & celebrate every worker on this #MayDay💥
Releasing in Theatres on AUG 11th🤟🏻
Mega🌟 @KChiruTweets @MeherRamesh @AnilSunkara1 @tamannaahspeaks @KeerthyOfficial @adityamusic pic.twitter.com/nOtkv3AntS
— AK Entertainments (@AKentsOfficial) May 1, 2023