Bhola Shankar Movie Muscial Update | హ్యాట్రిక్ ఫ్లాప్‌ల తర్వాత వాల్తేరు వీరయ్యతో తిరుగులేని కంబ్యాక్ ఇచ్చాడు చిరు. మిక్స్డ్ టాక్‌తో రెండోందల కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేయడం చిరుకే సాధ్యం అయింది. డిస్ట్రిబ్యూటర్లు సైతం ఈ సినిమాతో కోట్లల్లో లాభం పొందారు. ఇక ప్రస్తుతం చిరు అదే జోష్‌తో భోళా శంకర్‌ను పూర్తి చేసే పనిలో పడ్డాడు. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఆగస్టు 11న రిలీజ్ కానుంది. ఇప్పటివరకు రిలీజైన పోస్టర్లు, లిరికల్ సాంగ్ కాస్త మంచి హైపే తెచ్చిపెట్టాయి. అయితే ఇటీవలే రిలీజైన టీజర్ మాత్రం మెగా ఫ్యాన్స్‌లో పూనకాలు తెప్పించింది. మెహర్ రమేష్ వింటేజ్ బాస్‌ను చూపించే ప్రయత్నం చేశాడు.
ప్రస్తుతం ఈ సినిమా ప్యాచ్ వర్క్ పూర్తి చేసుకుంటుంది. ఇక సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మేకర్స్ బ్యాక్ టు బ్యాక్ అప్డేట్లు ప్రకటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలోని రెండో పాటకు సంబంధించిన మ్యూజికల్ అప్డేట్ను చిత్రబృందం వెల్లడించింది. జం జం జజ్జనక అంటూ సాగే సెలబ్రేషన్ సాంగ్‌ను మంగళవారం రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక ప్రోమోను ఆదివారం సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే రిలీజైన భోళా మేనియా ఇన్‌స్టాంట్‌గా ఎక్కేసింది. మహతి స్వరసాగర్ ఈ సినిమాకు స్వరాలు సమకూర్చాడు.
యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్టయిన వేదాళంకు రీమేక్‌గా తెరకెక్కుతుంది. సిస్టర్ సెంటిమెంట్ ప్రధానంగా సాగే ఈ సినిమాలో చిరుకు చెల్లెలిగా కీర్తి సురేష్ నటిస్తుంది. తమన్నా హీరోయిన్గా కనిపించనుంది. మెహర్ రమేష్ దాదాపు పదేళ్ల తర్వాత మళ్లీ ఈ సినిమాతో మెగా ఫోన్ పట్టాడు. తమన్నా హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను ఏకే ఎంటర్టైనమెంట్స్, క్రియేటీవ్ కమర్శియల్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
Boys and girls,🕺💃
It’s time for the MEGA CELEBRATION 🤩The Grand celebration song #JamJamJajjanaka from #Bholaashankar out on 11th JULY🔥
Song Promo Today @ 4:05 PM ❤️@SagarMahati thumping musical 🥁
Mega🌟 @KChiruTweets @MeherRamesh @AnilSunkara1 @tamannaahspeaks… pic.twitter.com/jn4SAArTTO
— AK Entertainments (@AKentsOfficial) July 9, 2023