Chiranjeevi | వాల్తేరు వీరయ్య వంటి మాస్సీవ్ కంబ్యాక్ తర్వాత చిరు భోళా శంకర్ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. ఇప్పటికే రిలీజైన ప్రచార చిత్రాలు, పాటల కాస్త మంచి హైప్ నే తీసుకొచ్చాయి. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుత చివర దశలో ఉంది. దానికి తోడు చిత్రబృందం బ్యాక్ టు బ్యాక్ అప్డేట్లు ప్రకటిస్తూ సినిమాపై మంచి ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తు్న్నారు. తమిళంలో హిట్టయిన వేదాళం సినిమాకు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. అజిత్ హీరోగా నటించిన ఈ సినిమా ఎనిమిదేళ్ల క్రితం విడుదలై తమిళంలో కోట్లు కొల్లగొట్టింది. ఇక తెలుగు నేటివిటీకి తగ్గట్లు మెహర్ రమేష్ పలు మార్పులు చేర్పులు చేస్తున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
ఈ సినిమా కోసం మెహర్ రమేష్ బాగానే కసరత్తులు చేస్తున్నాడు. వింటేజ్ మెగాస్టార్ ను ప్రేక్షకులకు చూపించాలని తెగ తాపత్రయపడుతున్నాడట. ఈ క్రమంలోనే కొన్ని కామెడీ సీన్స్ వింటేజ్ చిరును గుర్తుచేస్తాయట. ముఖ్యంగా వెన్నెల కిషోర్, హైపర్ ఆది, సత్యతో మధ్య సాగే కామెడీ సీన్స్ సినిమాకే హైలెట్ గా నిలుస్తాయాట. ఆగస్టు 11న విడుదల కాబోతున్న ఈ సినిమాలో చిరుకు జోడీగా తమన్నా నటిస్తుంది. కీర్తి సురేష్ కీలకపాత్ర పోషిస్తుంది. ఏకే ఎంటర్టైనమెంట్స్, క్రియేటీవ్ కమర్షియల్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.