మెగాస్టార్ చిరంజీవి డిసెంబర్ నెలలో నాలుగు సినిమాల షూటింగ్స్‌తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఆచార్య చిత్రంలో నటిస్తుండగా, ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. రామ్ చరణ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. మరోవైపు మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది. మలయాళం బ్లాక్‌బస్టర్ లూసీఫర్ రీమేక్ ఇది. కేవలం 3 నెలల్లోనే గాడ్ ఫాదర్ సినిమా షూట్ పూర్తి చేయాలని చూస్తున్నాడు చిరు.
ఇక మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ అనే చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా నవంబర్ నెలలో ఘనంగా ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ ఇటీవలే సెట్స్‌పైకి వచ్చింది. తమిళ సూపర్ హిట్ చిత్రం వేదాళంకి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన తమన్నా హీరోయిన్గా నటిస్తోంది. మరో స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్ చిరు చెల్లిగా కనిపించబోతుంది. ఇందులో చిరంజీవి మాసివ్ లుక్‌లో కనిపించనున్నట్టు సమాచారం.
ఈ చిత్రాన్ని దర్శకుడు మెహర్ రమేష్ జెట్ స్పీడ్ లో కంప్లీట్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ పై లేటెస్ట్ అప్డేట్ ని ఇచ్చారు మేకర్స్. ఈ సినిమా నుంచి ఇప్పుడు ఒక స్టైలిష్ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కించడమే కాకుండా ఒక మాసివ్ సాంగ్ ని కంప్లీట్ చేసినట్టుగా ఆన్ లొకేషన్ ఫొటోస్ ద్వారా కన్ఫర్మ్ చేశారు. ఈ సాంగ్ ని ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ సారథ్యంలో రూపొందించగా, దీని కోసం భారీ సెట్టింగ్ కూడా వేశారట. ఇక బాబీ దర్శకత్వంలోను చిరు మూవీ చేస్తున్న విషయం తెలిసిందే.