కరోనా సెకండ్ వేవ్ తర్వాత ఇప్పటి వరకు మోస్తారు సినిమాలు థియేటర్స్‌లోకి వచ్చి సందడి చేశాయి. ఇప్పుడు పెద్ద సినిమాల హంగామా షురూ కాబోతుంది. డిసెంబర్ 2న అఖండ విడుదల కానుండగా, అక్కడ నుండి జాతర మొదలు కానుంది. అయితే సంక్రాంతికి ఆర్ఆర్ఆర్, భీమ్లా నాయక్, రాధే శ్యామ్ చిత్రాలు విడుదల కానుండగా, భీమ్లా నాయక్ రిలీజ్‌పై అభిమానులలో అనేక అనుమానాలు నెలకొన్నాయి.
ఆర్ఆర్ఆర్, భీమ్లా నాయక్ షార్ట్ గ్యాప్‌లో విడుదలైతే థియేటర్స్, కలెక్షన్స్ విషయంలో జాప్యం జరుగుతుందని భావించిన ఆర్ఆర్ఆర్ నిర్మాతలు భీమ్లా నాయక్ చిత్రాన్ని పోస్ట్ పోన్ చేసేలా చర్చలు జరుపుతున్నారట. కాని భీమ్లా నాయక్ తగ్గేట్టు కనిపించడం లేదు. తాజాగా చిత్రం నుండి అప్డేట్ పోస్టర్ విడుదల చేయగా, ఇందులోను జనవరి 12న రిలీజ్ డేట్ అని ఉంది.
చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే పలు సాంగ్స్ విడుదల చేసిన మేకర్స్ మూడో సాంగ్‌కి టైం ఫిక్స్ చేశారు. డిసెంబర్ 1 ఉదయం 10.08నిల.కు అడవి తల్లి మాట అంటూ సాగే పాటను విడుదల చేయబోతున్నారు. ఈ పాట కూడా ప్రేక్షకులని అలరించే విధంగా ఉంటుందని అంటున్నారు. ఈ సినిమా కోసం అటు రానా అభిమానులు, పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రోజు రోజుకు ఈ సినిమా అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమా, చిత్రీకరణ పరంగా చివరిదశకి చేరుకుంది.