Bheemla Nayak trailer talk | ‘భీమ్లా నాయక్’ ట్రైలర్ టాక్.. నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ
భీమ్లా నాయక్ (Bheemla Nayak) ఈ సినిమా కోసం పవన్ అభిమానులు ఎంతగానో వేచి చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ అభిమానుల పండుగను రెట్టింపు చేస్తూ ట్రైలర్ కూడా వచ్చేసింది.
పవన్ కళ్యాణ్ (Pawan kalyan), రానా (Rana) ప్రధాన పాత్రల్లో సాగర్ కే చంద్ర (Saagar K Chandra) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా భీమ్లా నాయక్ (Bheemla Nayak). ఈ సినిమా కోసం పవన్ అభిమానులు ఎంతగానో వేచి చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫిబ్రవరి 25న విడుదల అవుతుంది అని తెలియగానే పండగ చేసుకోవడం మొదలుపెట్టారు పవన్ అభిమానులు. ఇప్పుడు వాళ్ల పండుగను రెట్టింపు చేస్తూ ట్రైలర్ కూడా వచ్చేసింది. కచ్చితంగా ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలు మరింత పెంచేస్తోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఒరిజినల్ లో ఉన్న ఫీల్ పోకుండా.. తెలుగు ఆడియెన్స్ కు తగ్గట్లు కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా బాగానే యాడ్ చేశారని ట్రైలర్ చూస్తుంటే అర్ధం అవుతుంది. ఇన్ని రోజులు పోస్టర్స్ లో రానా దగ్గుబాటిని పెద్దగా పట్టించుకోలేదు.. కానీ ఈ సినిమాలో మాత్రం ఆయన పాత్ర బలంగా ఉండబోతుందని ట్రైలర్ చూస్తుంటే అర్ధం అవుతుంది. సినిమాలో ఇద్దరు హీరోలు ఉన్నారు అని ట్రైలర్ తో క్లారిటీ వచ్చేసింది. మలయాళం సినిమా చూసిన వాళ్లకు ఈ ట్రైలర్ కొత్తగా అనిపించదు కానీ.. ఒరిజినల్ చూడని వాళ్లకు మాత్రం కచ్చితంగా పండగ.
ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ఆత్మాభిమానం.. ఒక డబ్బున్న వ్యక్తి ఈగో మధ్య జరిగే సంఘర్షణ ఈ సినిమా కథ. గబ్బర్ సింగ్ తర్వాత మరోసారి పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన సినిమా కావడంతో అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. దానికి తోడు ట్రైలర్లో అటు పవన్.. ఇటు రానా ఇద్దరు సరిసమానంగా కనిపించారు. ఎవరినీ తక్కువ చేయకుండా సమానమైన స్క్రీన్ స్పేస్ ఇచ్చారు.
Bheemla nayak trailer | తోలు తీస్తా నా కొడకా..భీమ్లా నాయక్ ట్రైలర్ అదిరిందంతే
రేపు సినిమాలో కూడా ఇదే జరుగుతుందని దగ్గుబాటి అభిమానులు భావిస్తున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ అభిమానులకు టైలర్ ఓ రేంజ్లో కిక్ ఇస్తుంది. నాయక్ నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ అంటూ రానా చెప్పిన డైలాగ్ ట్రైలర్ కు హైలెట్. మొత్తానికి భీమ్లా నాయక్ ట్రైలర్ సినిమాపై అంచనాలు బాగానే పెంచేసింది. మరి ఇది ఎంతవరకు నిజం అవుతాయో చూడాలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

