టాలీవుడ్ (Tollywood) ప్రేక్షకులు విడుదల ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో టాప్ ప్లేస్‌లో ఉంటాయి సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata), భీమ్లా నాయక్ (Bheemla Nayak). స్టార్ హీరోలు మహేశ్‌బాబు, పవన్‌కల్యాణ్ సినిమాలు కావడంతో ఈ రెండు చిత్రాలపై అంచనాలు ఎప్పటిలాగే ఓ రేంజ్లో ఉన్నాయి. ఈ రెండు సినిమాలు సంక్రాంతి బరిలోకి దిగనున్నట్టు ఇప్పటికే డేట్స్ కూడా బయటకు వచ్చాయి.
అయితే ఈ భారీ చిత్రాలు సంక్రాంతి రేస్ నుంచి తప్పుకోనున్నాయా..? దర్శక నిర్మాతలు కొత్త విడుదల తేదీలు ఫిక్స్ చేశారా..? అన్న దానికి సంబంధించి ఓ న్యూస్ ఫిలింనగర్లో చక్కర్లు కొడుతోంది. సర్కారు వారి పాట చిత్రాన్ని ఏప్రిల్ 28న విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. మరోవైపు భీమ్లా నాయక్ సినిమా విడుదల కోసం కూడా కొత్త స్లాట్లను పరిశీలించే పనిలో దర్శకనిర్మాతలు ఉన్నారన్న వార్త ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.
మరి నిర్మాతలు ఇలా సడెన్‌గా కొత్త తేదీల వేటలో ఎందుకు పడ్డారనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ గానే ఉంది. ఒకవేళ ఈ రెండు సినిమాలు పక్కకు తప్పుకుంటే సంక్రాంతికి పోటీ పడే భారీ చిత్రాల్లో ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ ఉండనున్నాయి. వీటితోపాటు నాగార్జున నటిస్తోన్న బంగార్రాజు కూడా సంక్రాంతికే విడుదల కానున్నట్టు వార్తలు వస్తున్నా..దీనిపై ఎలాంటి ప్రకటన బయటకు రాలేదు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Charmy Kaur | యాక్టింగ్‌లోకి రీఎంట్రీపై ఛార్మీ ఏమన్నదంటే..?
Rajinikanth | రేపు నాకు చాలా ప్రత్యేకమైన రోజు: ట్విటర్ లో రజినీకాంత్
Rakul Preet Singh | రకుల్‌ప్రీత్ సింగ్ కొత్త యోగాసనం