Bheemla nayak | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘భీమ్లానాయక్’. సాగర్ కే చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైనమెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించాడు. త్రివిక్రమ్ ఈ చిత్రానికి మాటలు, స్క్రీన్‌ప్లే అందించాడు. భారీ అంచనాల మధ్య ఫిబ్రవరి 25న విడుదలైన ఈ చిత్రం 2 రోజుల్లోనే 100 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించి రికార్డు సృష్టించింది. పవన్ కళ్యాణ్ ఈ చిత్రంలో పోలీస్ అధికారిగా నటించగా రానా ఎక్స్ మిలిటరి అధికారిగా నటించాడు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ వుమెన్ పోలీస్ అధికారులకు ‘భీమ్లానాయక్’ చిత్రాన్ని బంజారాహిల్స్‌లోని జివికె మాల్లో స్పెషల్ స్క్రీనింగ్ వేయించబోతున్నాడు. దీనికోసం సివి ఆనంద్ 1200 టికెట్లను కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ చిత్రం సివి ఆనంద్‌కు బాగా నచ్చిందట. ఈ చిత్రంలో మహిళలకు ప్రాధాన్యత కనిపించిందని ప్రశంసించాడు. ‘మహిళలు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేయడం అంత సులువు కాదు. కానీ చాలా మంది మహిళలు పోలీస్ జబ్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారని’ పేర్కొన్నాడు.