పవన్ కళ్యాణ్-రానా ప్రధాన పాత్రలలో సాగర్ కె చంద్ర తెరకెక్కించిన చిత్రం భీమ్లా నాయక్. చిత్రంలో పవన్‌కి జంటగా నిత్యా మీనన్, రానాకి జంటగా సంయుక్త మీనన్ నటిస్తున్నారు ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం మూవీని జనవరి 12న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. కాని సడెన్‌గా ఆర్ఆర్ఆర్ జనవరి 7న విడుదల కానుందని ప్రకటించడంతో మహేష్ బాబు లాంటి హీరో వెనక్కు తగ్గాడు. ఏప్రిల్ లో సర్కారు వారి పాట విడుదల చేయబోతున్నట్టు పేర్కొన్నాడు.
ఇక పవన్ సినిమా కూడా వాయిదా పడుతుందని అందరు అనుకున్నారు. ఫిబ్రవరిలో రిలీజ్ అవుతుందంటూ ప్రచారం జరిగింది. కాని తాజాగా జనవరి 12న చిత్రం విడుదల కానుందంటూ అఫీషియల్‌గా ప్రకటించారు. దీంతో సంక్రాంతి బరిలో ఆర్ఆర్ఆర్, భీమ్లా నాయక్, రాధే శ్యామ్ మధ్య గట్టి పోటి ఉండడం ఖాయంగా కనిపిస్తుంది. ఆర్ఆర్ఆర్, భీమ్లా నాయక్, రాధేశ్యామ్ మూడూ సంక్రాంతికి విడుదలయితే థియేటర్ల సమస్య వస్తుంది. పైగా ఎంత కాదన్నా రెవెన్యూ కూడా షేర్ అవుతుంది. కానీ తప్పని సరి పరిస్థితి అని అంటున్నారు.