పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి బయటే కాదు సినిమా ఇండస్ట్రీలోను చాలా మంది వీరాభిమానులు ఉన్నారు.వారందరు పవన్ సినిమా కోసం కళ్లల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తుంటారు. ప్రస్తుతం పవన్ చేస్తున్న భీమ్లా నాయక్ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. కొద్ది రోజుల క్రితం ఈ సినిమాలో ఓ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో పవన్ నటిస్తున్నట్లు తెలియజేస్తూ, ఓ చిన్న మేకింగ్ వీడియో విడుదల చేశారు. ఇది అంచనాలు రెట్టింపు చేసింది.
ఇక అభిమానులకు స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా సినిమా నుంచి ‘భీమ్లా నాయక్’ ఫస్ట్ గ్లింప్స్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్. లుంగీ కట్టులో మాస్ లుక్‌లో పవన్ ఈ టీజర్లో అదిరిపోయారు. ‘రేయ్ డాని బయటకు రారా’ అనే డైలాగ్‌తో ప్రారంభం అయిన ఈ టీజర్లో పవన్ యాక్షన్ మరో లెవల్లో ఉంది. చివర్లో విలన్ ‘డాని.. డానియల్ శేఖర్’ అని అంటే.. పవన్ ‘భీమ్లా.. భీమ్లా నాయక్’ అంటూ మాస్ జవాబు ఇస్తారు. ఈ వీడియోలో థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా వేరే లెవల్లో ఉంది.
చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ మాస్ విశ్వరూపం కనిపించడం తో అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. యూ వీ క్రియేషన్స్ మరియు గీతా ఆర్ట్స్ పతాకాల పై తెరకెక్కుతున్న పక్కా కమర్షియల్ చిత్రం సెట్లో కూడా సెలబ్రేషన్స్ జరిగాయి. సెట్స్ లో పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ గ్లింప్స్ సెలబ్రేషన్స్ జరిగిన వీడియో ను సోషల్ మీడియాలో షేర్ చేశారు డైరక్టర్ మారుతీ. ఈ వీడియో చూసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. పక్కా కమర్షియల్ చిత్రం లో గోపీచంద్ సరసన హీరోయిన్ గా రాశి ఖన్నా నటిస్తుంది.
My team enjoying #BheemlaNayakGmilmpse today at our #PakkaCommercial set
— Director Maruthi (@DirectorMaruthi) August 15, 2021
Goosebumps stuff given by #Powerstar @PawanKalyan garu & team @MusicThaman @saagar_chandrak #Trivikram garu @vamsi84 #BheemlaNayak pic.twitter.com/DrOUTjCh84