Bheemla Nayak | భీమ్లా నాయక్ సినిమా రివ్యూ
Bheemla Nayak | నటీనటులు – పవన్ కళ్యాణ్, రానా, నిత్యామీనన్, సముద్రఖని, మురళీ శర్మ, తనికెళ్ల భరణి, రఘుబాబు, రావు రమేష్ తదితరులు
సాంకేతిక నిపుణులు – సినిమాటోగ్రఫీ – రవి కె చంద్రన్, సంగీతం – ఎస్ థమన్, ఎడిటింగ్ – నవీన్ నూలి, బ్యానర్ – సితార ఎంటర్ టైన్ మెంట్స్, నిర్మాత – సూర్యదేవర నాగవంశీ, స్క్రీన్ ప్లే , మాటలు – త్రివిక్రమ్, దర్శకత్వం – సాగర్ కె చంద్ర.
థియేటర్లు, మల్టీప్లెక్సులు అనే తేడా లేకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సందడి మొదలైంది. ఎక్కడ చూసినా గుంపులుగా ప్రేక్షకులతో థియేటర్లు ఓవర్ ఫ్లో అవుతున్నాయి. లాక్ డౌన్ తర్వాత ఇంత భారీస్థాయిలో ఆడియెన్స్ ను రప్పించిన సినిమా ఇదే కావొచ్చు. పవన్ గత సినిమా వకీల్ సాబ్ సూపర్ హిట్ కావడం కూడా ఈ క్రేజ్ కు ఒక కారణమైంది. ఓపెనింగ్స్ తో రికార్డులు సృష్టిస్తున్న భీమ్లా నాయక్ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం..
కథ
భీమ్లా నాయక్ (పవన్ కళ్యాణ్) శ్రీశైలం దగ్గర హఠకేశ్వరం ప్రాంత సబ్ ఇన్స్పెక్టర్. నిజాయితీ గల అధికారిగా రాష్ట్రపతి మెడల్ సాధిస్తాడు. చట్టాన్ని నిఖార్సుగా అమలు చేసే భీమ్లా.. ఊరి ప్రజలకు మాత్రం తనకు న్యాయం అనిపించిన సాయాన్ని చేస్తుంటాడు. దాంతో స్థానికులు భీమ్లా నాయక్ ను పోలీస్ అధికారి కాకుండా దేవుడిలా చూస్తుంటారు. ఎక్సైజ్, అటవీ శాఖలతో కలిసి పోలీసులు చేస్తున్న తనిఖీల్లో డేనియల్ శేఖర్ (రానా) పట్టుబడతాడు. అతని కారులో పదుల సంఖ్యలో మద్యం బాటిల్స్ లభిస్తాయి. అరెస్టు చేయబోయిన పోలీసులతో గొడవపడి వాళ్లపై దాడికి దిగుతాడు డేనియల్ శేఖర్. భీమ్లా నాయక్ అతన్ని అరెస్ట్ చేసి స్టేషన్ కు తీసుకెళ్తాడు. డేనియల్ శేఖర్ తండ్రి మాజీ ఎంపీ, సమాజంలో పలుకుబడి ఉన్నవాడు. దీంతో అతన్ని జాగ్రత్తగా చూసుకోమని పై అధికారి కోదండరామ్ (మురళీ శర్మ).. ఎస్ఐ భీమ్లా నాయక్ కు చెబుతాడు. మద్యం కావాలన్నా ఇమ్మంటాడు. భీమ్లా.. డేనియల్ కు మద్యం ఇస్తాడు. అరెస్ట్ చేయడాన్ని అవమానంగా భావించిన డేనియల్.. భీమ్లాపై బదులు తీర్చుకునేందుకు, మద్యం అందించిన సన్నివేశాన్నితన ఫోన్ లో రికార్డ్ చేస్తాడు. రెండు వారాలు జైలు జీవితం గడిపిన డేనియల్ శేఖర్ బయటకొచ్చాక.. భీమ్లా తనకు మద్యం అందించిన వీడియోను మీడియాకు లీక్ చేస్తాడు. దీంతో భీమ్లా ఉద్యోగం పోతుంది. బెయిల్ మీద ఉన్న డేనియల్ కు స్థానికంగా బార్ నడిపే నాగరాజు (రావు రమేష్) తోడవుతాడు. డేనియల్ శేఖర్ తండ్రి (సముద్రఖని) తన పరపతితో భీమ్లా భార్య సుగుణ (నిత్యామీనన్) అటవీ ఉత్పత్తులను స్థానికులకు పంచుతోందనే కారణంతో అరెస్ట్ చేయిస్తాడు. ఉద్యోగం పోయేందుకే కాకుండా భార్యను జైలుపాలు చేసిన డేనియల్ శేఖర్ పై భీమ్లా నాయక్ ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు అనేది మిగిలిన కథ.
ఎలా ఉందంటే..
ఇంట్రడక్షన్ సీన్ నుంచీ క్లైమాక్స్ దాకా పవన్ కళ్యాణ్ క్రేజ్ కు తగినట్లు మలిచిన చిత్రమిది. భీమ్లా నాయక్ పాత్రలో పవన్ పవర్ చూపించారు. స్థానికుల మనసు తెలిసిన వ్యక్తిగా, చట్టాన్ని అనుసరించే నిజాయితీ గల పోలీస్ అధికారిగా పవన్ ఫర్మార్మెన్స్ అదిరిపోయింది. రానాతో ఢీ అంటే ఢీ అనే సన్నివేశాల్లో ఎమోషనల్ యాక్టింగ్ తో మెప్పించారు. పవన్ అప్పీయరెన్స్, యాక్షన్ సీన్స్, డైలాగ్స్ అభిమానులకైతే పండగే అని చెప్పాలి. పవన్ నిత్యామీనన్ మధ్య వచ్చే సీన్స్ ప్లెజంట్ గా ఉన్నాయి. డేనియల్ శేఖర్ గా రానా ఆకట్టుకున్నారు. ఈ క్యారెక్టర్ లో అతను పలికించిన భావోద్వేగాలు, బలహీనతలు సహజంగా అనిపిస్తాయి.
మలయాళ హిట్ ఫిల్మ్ అయ్యప్పనుమ్ కోషియమ్ కు రీమేక్ చిత్రమిది. మూల కథను అలాగే ఉంచి తెలుగు నేటివిటికీ తగినట్లు మార్పులు చేశారు త్రివిక్రమ్. కథనం, మాటలు, పాత్రల్లో మార్పులు తీసుకొచ్చారు. కథనాన్ని తెలుగుకు మార్చిన విధానం బాగుంది. ఏ సన్నివేశానికీ లింక్ తెగకుండా కథ ఆసాంతం తెరపై ఒక ధారగా చెప్పగలిగారు త్రివిక్రమ్. మాతృకలోని కుట్టమణి క్యారెక్టర్ ను నాగరాజుగా మార్చి రావు రమేష్ తో చేయించారు. ఈ పాత్రలో రావు రమేష్ చెప్పిన డైలాగులు బాగా నవ్వించాయి. మీరు మొగుళ్లకు అన్నాలు పెట్టరు, మగాళ్లకు దణ్ణాలు పెట్టరు డైలాగ్ థియేటర్ లో నవ్వుల బాంబై పేలింది.
ఆత్మగౌరవానికి, అహంకారానికీ మధ్య సాగే పోరాటమే ఈ కథ. నిజాయితీ గల పోలీస్ అధికారి, సంఘంలో పరపతి గల తలబిరుసు వ్యక్తితో తలపడితే ఆ సంఘర్షణ ఎలా ఉంటుందో భీమ్లా నాయక్ లో చూస్తాం. పవన్ రానా పాత్రలు తలపడే తీరు నువ్వా నేనా అన్నట్లు సాగింది. రవి కె చంద్రన్ సినిమాటోగ్రఫీ, థమన్ పాటలు, నేపథ్య సంగీతం భీమ్లా…సినిమాటిక్ ఫీల్ ను పెంచాయి. సాగర్ కె చంద్ర సినిమాను మలిచిన తీరు మెప్పిస్తుంది.
ఫ్లస్ పాయింట్స్
పవన్ కళ్యాణ్, రానా నటన
త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు
థమన్ నేపథ్య సంగీతం
రావు రమేష్ క్యారెక్టర్
మైనస్ పాయింట్స్
ద్వితీయార్థంలో కొన్ని సన్నివేశాలు
చివరగా – భీమ్లా నాయక్….పవర్ ప్యాక్
రేటింగ్ 3.25/5
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
President Droupadi Murmu | ఒడిశాకు తుఫాన్ సూచన.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన వాయిదా
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
Sridhar Vembu | ఏఐ రంగంలో కనిపిస్తున్నది బూమ్ కాదు బుడగ : శ్రీధర్ వెంబు
Lulu jobmela | ఈ నెల 27న జాబ్ మేళా.. వివరాలివే
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

