ఎప్పుడు లేనంత సందడి ఈ సంక్రాంతికి ఉందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ సారి ఆర్ఆర్ఆర్ సినిమాతో సంక్రాంతి సందడి మొదలు కానుండగా, ఆ తర్వాత వరుస పెట్టి పెద్ద సినిమాలు ప్రేక్షకుల మందుకు రాబోతున్నాయి. పాన్ ఇండియా మూవీస్ ‘ఆర్ఆర్ఆర్’, ‘భీమ్లా నాయక్’ , ‘సర్కారు వారి పాట’, ‘రాధే శ్యామ్’ సంక్రాంతి బరిలో నిలుస్తునట్లు తెలిపారు. ఈ భారీ క్లాష్‌లో కొన్ని సినిమాలు వాయిదా పడనున్నాయని ప్రచారం జరుగుతుంది.
సంక్రాంతికి పాన్ ఇండియా సినిమాలు విడుదల అవ్వడంతో భీమ్లా నాయక్ వెనక్కి తగ్గుతాడా అంటూ జోరుగా వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై నిర్మాత నాగవంశీ స్పందించారు. “భీమ్లా నాయక్, డేనియల్ శేఖర్ అల్టిమేట్ క్లాష్ తో జనవరి 12 న బిగ్ స్క్రీన్ వెలిగిపోతుంది” అంటూ ట్వీట్ చేశారు. దీంతో భీమ్లా నాయక్ వెనక్కి తగ్గుతోంది అనే రూమర్స్ కి చెక్ పడినట్లు అయ్యింది.
పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తుండగా.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్ రికార్డ్ ను క్రియేట్ చేశాయి. ఈ సినిమా పై అభిమానులలో భారీగా అంచనాలు నెలకొని ఉన్నాయి.