గాయత్రీ గుప్తా, గణేష్ రెడ్డి, పూజా కేంద్రే, సాయిసతీష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘భవానీ వార్డ్’. జీవీ నరసింహా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కల్యాణ్ చక్రవర్తి, చంద్రకాంత్ సోలంకి నిర్మిస్తున్నారు. సోమవారం ఫస్ట్‌లుక్‌ను లాంచ్ చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘విభిన్న కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. చక్కటి వినోదంతో పాటు సెంటిమెంట్‌తో ఆకట్టుకుంటుంది’ అన్నారు.
తన పాత్ర భిన్న కోణాల్లో సాగుతుందని, అభినయానికి ఆస్కారం ఉన్న పాత్ర దక్కడం అదృష్టంగా భావిస్తున్నానని గాయత్రీ గుప్తా చెప్పింది. ఈ సినిమా ద్వారా తనకు మళ్లీ నటుడిగా అవకాశమిచ్చారని, మంచి పాత్రను పోషించానని చిత్ర పీఆర్వో, నటుడు సాయి సతీష్ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: అరవింద్ బి, సంగీతం: సోల్మోన్రాజ్, నిర్మాణ సంస్థ: అవి క్రియేషన్స్, విభు ప్రొడక్షన్స్, దర్శకత్వం: జీవీ నరసింహా.