Bharathanatyam Movie | ‘దొరసాని’ (Dorasani) లాంటి ఫస్ట్ మూవీతోనే మంచి మార్కులు కొట్టాడు దర్శకుడు కేవీఆర్ మహేంద్ర (KVR Mahendra). తెలంగాణ బ్యాక్డ్రాప్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిసెంట్ హిట్ తెచ్చుకోవడమే కాకుండా విమర్శకుల దగ్గరనుంచి ప్రశంసలు అందుకుంది. ఇక తాజాగా కేవీఆర్ మహేంద్ర డైరెక్షన్లో వస్తున్న చిత్రం భరతనాట్యం (Bharathanatyam). సినిమా ఈజ్ ది మోస్ట్ బ్యూటీఫుల్ ఫ్రాడ్ ఇన్ ది వరల్డ్’ అనేది ఉపశీర్షిక.
పోకిరి, అర్జున్ రెడ్డి, కేజీఎఫ్, వంటి బ్లాక్ బస్లర్ చిత్రాలకు టైటిల్ పోస్టర్ డిజైన్ చేసిన సీనియర్ గ్రాఫిక్ డిజైనర్ ధని ఏలే(Dhani Aelay) తనయుడు సూర్య తేజ ఏలే (Surya Teja Aelay) ఈ సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. మీనాక్షి గోస్వామి (Meenakshi Goswamy) కథానాయికగా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ విడుదల చేయగా.. ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి మేకర్స్ టీజర్ వదిలారు.
‘BHARATHANATYAM’ TEASER LAUNCHED… #Telugu film #Bharathanatyam – a crime-comedy directed by #KVRMahendra [#Dorasaani fame] – teaser out now.
Filming complete… Post-production work in progress.#SuryaTejaAelay – who debuts in the lead role – has also penned the story… Also… pic.twitter.com/0Fg8vSrShV
— taran adarsh (@taran_adarsh) October 7, 2023
సినిమాలంటే పిచ్చి ఉండి దర్శకుడు కావాలనుకొనే ఓ యువకుడి కథ ఈ సినిమా అని టీజర్ చూస్తే తెలిసిపోతుంది. ఇక క్రైమ్ కామెడీ జానర్లో రానున్న ఈ సినిమాలో వైవా హర్ష, హర్షవర్ధన్, అజయ్ ఘోష్, సలీం ఫేకు, గంగవ్వ, కృష్ణుడు, టెంపర్ వంశీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తుండగా.. ఈ సినిమాకు వెంకట్ ఆర్ శాకమూరి సినిమాటోగ్రఫీ, రవితేజ గిరిజాల ఎడిటర్