Bigg Boss 9 | బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో ప్రస్తుతం ఫ్యామిలీ వీక్ సందడి కొనసాగుతోంది. 74వ రోజు పూర్తిగా సెంటిమెంట్‌తో పాటు హైడ్రామాతో నిండిపోయింది. వరుసగా కంటెస్టెంట్ల కుటుంబ సభ్యులు హౌస్ లోకి వచ్చి తమ తమ ఫేవరెట్స్కి సపోర్ట్ ఇవ్వడంతో పాటు, ఇంటి వాతావరణాన్ని మరో స్థాయికి తీసుకెళ్లారు..మొదటగా కళ్యాణ్ తల్లి లక్ష్మి హౌస్‌లోకి వచ్చారు. కొడుకుతో సరదాగా మాట్లాడి, సభ్యులందరికీ హగ్గులు ఇచ్చి పాజిటివ్ వైబ్‌ను తీసుకువచ్చారు. ఈ సందర్భంగా తనూజ, లక్ష్మికి ఒక చీరను గిఫ్ట్‌గా ఇచ్చింది. ఆ తర్వాత కళ్యాణ్ దీనిపై తనూజను ప్రశ్నించగా.. “ఫ్యామిలీ మెంబర్లా భావించి ఇచ్చాను, దాంట్లో మరో అర్థం లేదు” అని ఆమె స్పష్టం చేసింది.
ఇదే సమయంలో భరణి.. తనూజ లెగ్‌కు మసాజ్ చేయడాన్ని చూసిన దివ్య అసహనం వ్యక్తం చేసింది. “ఎందుకు మసాజ్ చేశావ్? నీకు తనూజ నచ్చుతుందా?” అంటూ దివ్య ప్రశ్నించగా, తనూజ కూడా దివ్య ప్రవర్తనపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది.అయితే దివ్య చాలా కోపంగా ఉండగా, “తనూజ అవసరానికి అనుగుణంగా మనుషుల్ని వాడుకుంటుంది… అలాంటి వాళ్లంటే నాకు చిరాకు” అని భరణికి చెప్పింది. తర్వాత రీతూ తల్లి హౌస్‌లోకి వచ్చి ఇంటి సభ్యులను పలకరించారు. “ఇక నాలుగు వారాలే ఉన్నాయి… గట్టిగా ఆడాలి” అంటూ రీతూకి ఎనర్జీ బూస్ట్ ఇచ్చారు.
ఇక తాజా ఎపిసోడ్ హైలైట్ అయితే భరణి చిన్న కూతురు హారతి ఎంట్రీ. స్టోర్ రూమ్ నుంచి బయటకు వచ్చిన ఆమె, తండ్రిని గట్టిగా కౌగిలించుకుని ఎమోషన్ మూడ్‌లోకి వెళ్లిపోయింది. సభ్యులందరితో మాట్లాడిన హారతి, తనూజను చూసి “మీరు నాన్నతో ఉన్న బాండింగ్ మా ఫేవరిట్” అని చెప్పింది. నాన్న హెల్త్ బాగా లేనప్పుడు చూసుకున్నావ్… అందుకు థ్యాంక్స్. కానీ నాన్నతో కమాండింగ్‌గా బిహేవ్ చేయొద్దు ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసింది. దివ్య కూడా “ఇకపై అలా బిహేవ్ చేయను” అంటూ మాట ఇచ్చింది. హౌస్ నుంచి వెళ్లే ముందు హారతి తన తండ్రికి చివరి సలహాగా.. నిన్ను కమాండ్ చేసే వాళ్ల దగ్గర సాఫ్ట్‌గా ఉండొద్దు… ఫైర్ చూపించు” అని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. మొత్తానికి ఫ్యామిలీ వీక్ కారణంగా కంటెస్టెంట్ల భావోద్వేగాలు పీక్‌కి చేరడంతో పాటు, ఇంటి డైనమిక్స్ లో కొత్త మలుపులు కనిపిస్తున్నాయి.