Bhairavam | వైవిధ్యమైన కంటెంట్‌తో తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకుంటున్న ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5 మరోసారి సక్సెస్ఫుల్ మూవీతో దూసుకెళ్తోంది. మే 30న థియేటర్లలో విడుదలై మంచి స్పందన పొందిన ‘భైరవం’ చిత్రం, జూలై 18న జీ5 ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ మొదలైంది. విడుదలైన కొద్ది రోజుల్లోనే ఈ మూవీ ఓటీటీలో 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్‌ను దాటి రికార్డ్ సెట్ చేసింది. థియేటర్లలోను ఓటీటీలోనూ ‘భైరవం’ విపరీతమైన ఆదరణను సొంతం చేసుకోవడంతో చిత్ర బృందం సంతోషం వ్యక్తం చేస్తుంది. గ్రామంలోని ముగ్గురు స్నేహితుల కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం, స్నేహం, ప్రేమ, రాజకీయం మరియు భావోద్వేగాలతో నిండి ఉంది.
గ్రామంలోని ఆలయ భూములపై కన్నేసిన ఓ రాజకీయ నాయకుడి కుట్రలకు ముగ్గురు స్నేహితులు ఎలా బదులు ఇచ్చారు? వారి జీవితం ఎలా మారిపోయింది? అనే ఆసక్తికరమైన కథాంశంతో భైరవం ప్రేక్షకుల మన్నన పొందింది. చాలా రోజుల తర్వాత మనోజ్ ఈ చిత్రంలో నటించగా, మూవీ హిట్ కావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అయ్యారు. ఈ చిత్రంలో బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ ముఖ్య పాత్రల్లో నటించగా, ఆనంది శంకర్, దివ్యా పిళ్లై, ఆనంది కీలక పాత్రల్లో ఆకట్టుకున్నారు. విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన ఈ సినిమాకు, హరి కె. వేదాంతం సినిమాటోగ్రఫీ అందించగా, శ్రీ చరణ్ పాకాల సంగీతాన్ని సమకూర్చారు. చోటా కె. ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు.
సిల్వర్ స్క్రీన్‌పై మెప్పించిన ఈ సినిమా, ఇప్పుడు ఓటీటీ వేదికగా కూడా ప్రేక్షకులను అలరిస్తోంది. జూలై 18 నుంచి జీ5లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రాన్ని మిస్ అయిన వారు ఓ సారి చూడండి. కాగా, జీ5 అత్యద్భుతమైన వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫార్మ్ గా పేరు తెచ్చుకోగా, 3,500 సినిమాల లైబ్రరీ ఉన్న ప్లాట్ఫార్మ్ ఇది. 1,750 టీవీ షోలు, 700 ఒరిజినల్స్, 5 లక్షలకు పైగా కంటెంట్ ఈ సంస్థ సొంతం. 12 భాషల్లో (హిందీ, ఇంగ్లిష్, బెంగాలీ, మలయాళం, తెలుగు, తమిళ్, మరాఠీ, ఒరియా, భోజ్‌పురి, గుజరాతీ, పంజాబీ)లో ఇందులో కంటెంట్ అందుబాటులో ఉంటుంది. వాటిలో బెస్ట్ ఒరిజినల్స్, ఇంటర్నేషనల్ మూవీస్, టీవీ షోస్, మ్యూజిక్, కిడ్స్ షోస్, ఎడ్టెక్, సినీ ప్లేస్, న్యూస్, లైవ్ టీవీ, హెల్త్, లైఫ్‌స్టైల్ విభాగాలు ప్రేక్షకులని ఎంతగానో అలరింపజేస్తుంది.