Bhairathi Ranagal | కన్నడ చక్రవర్తి స్టార్ హీరో శివరాజ్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం భైరతి రణగల్. ఈ సినిమాకు నర్తన్ దర్శకత్వం వహిస్తుండగా.. సప్త సాగరాలు దాటి హీరోయిన్ రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమా కన్నడలో నవంబర్ 15న ప్రేక్షకుల ముందుకు మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమాకు వచ్చిన టాక్‌తో తాజాగా తెలుగులో డబ్ చేస్తున్నారు మేకర్స్. ఈ సందర్భంగా మూవీ నుంచి తెలుగు ట్రైలర్‌ను విడుదల చేశారు.
ఈ ట్రైలర్ చూస్తుంటే శివరాజ్ కుమార్ మరోసారి తన మాస్ యాక్షన్‌తో అలరించబోతున్నట్లు తెలుస్తుంది. 2017లో సూపర్ హిట్ చిత్రంగా నిలిచిన మఫ్తీకి ప్రీక్వెల్‌గా ఈ చిత్రం వస్తుండగా.. గీతా పిక్చర్స్ బ్యానర్ పై గీతా శివరాజ్ కుమార్ ఈ సినిమాను నిర్మించింది. తెలుగుతో పాటు తమిళంలో ఈ చిత్రాన్ని నవంబర్ 29న విడుదల చేయనున్నారు మేకర్స్.