Bhagyashri Borse | ‘మిస్టర్ బచ్చన్’ చిత్రం ద్వారా తెలుగు సినీరంగంలోకి అరంగేట్రం చేస్తున్నది మరాఠీ సుందరి భాగ్యశ్రీ బోర్సే. తొలి సినిమాకే తెలుగులో సొంతంగా డబ్బింగ్ చెప్పడం గొప్ప అనుభూతినిచ్చిందని, తెలుగు బ్యూటీఫుల్ లాంగ్వేజ్ అంటూ కొనియాడింది. రవితేజ హీరోగా హరీష్‌శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా శుక్రవారం భాగ్యశ్రీ బోర్సే పాత్రికేయులతో ముచ్చటిస్తూ పంచుకున్న సంగతులు…