Bhagyashri Borse | హిందీలో నాయికగా అరంగేట్రం.. మ్యూజికల్ లవ్‌స్టోరీలో నటించనున్న భాగ్యశ్రీ బోర్సే
ఇటీవలే ‘లెనిన్' సినిమాతో కెరీర్లో భారీ విజయాన్ని దక్కించుకుంది మరాఠీ సుందరి భాగ్యశ్రీ బోర్సే. టాలీవుడ్లో సుదీర్ఘ నిరీక్షణ తర్వాత లభించిన ఈ సక్సెస్ పట్ల ఆమె సంతోషంగా ఉంది. ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో అగ్ర కథానాయికల్లో ఒకరిగా కొనసాగుతున్న ఈ సొగసరి త్వరలో బాలీవుడ్లో నాయికగా ఎంట్రీ ఇవ్వబోతున్నది.
ఇటీవలే ‘లెనిన్’ సినిమాతో కెరీర్లో భారీ విజయాన్ని దక్కించుకుంది మరాఠీ సుందరి భాగ్యశ్రీ బోర్సే. టాలీవుడ్లో సుదీర్ఘ నిరీక్షణ తర్వాత లభించిన ఈ సక్సెస్ పట్ల ఆమె సంతోషంగా ఉంది. ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో అగ్ర కథానాయికల్లో ఒకరిగా కొనసాగుతున్న ఈ సొగసరి త్వరలో బాలీవుడ్లో నాయికగా ఎంట్రీ ఇవ్వబోతున్నది. ఆదిత్యరాయ్ కపూర్ సరసన భాగ్యశ్రీ బోర్సే ఓ మ్యూజికల్ లవ్‌స్టోరీలో నటించనుంది. మిలాప్ మిలాన్ జవేరి దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని టీ సిరీస్ పతాకంపై భూషణ్ కుమార్ నిర్మించనున్నారు.
త్వరలో ఈ సినిమా సెట్స్‌మీదకు వెళ్లనున్నట్లు తెలిసింది. బాలీవుడ్లో ఇప్పటికే యారియాన్, చందూ ఛాంపియన్ వంటి చిత్రాల్లో అతిథి పాత్రల్లో మెరిసింది భాగ్యశ్రీ బోర్సే. అయితే కథానాయికగా మాత్రం ఆమెకిది తొలి అవకాశం కావడం విశేషం. ప్రస్తుతం ఈ భామ తమిళంలో ‘సేయాన్’ చిత్రంలో నటిస్తున్నది. తెలుగులో కొన్ని భారీ సినిమాలు చర్చల దశలో ఉన్నట్లు సమాచారం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

